బ్యాంకులో డబ్బులు దాచుకున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు!చాలా మంది చేతిలోని డబ్బును బ్యాంకులో దాచుకుంటూ ఉంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ FD చేస్తుంటారు. బ్యాంకులో డబ్బులు ఎఫ్‌డీ చేసుకోవడం వల్ల పెద్దగా రిస్క్ ఉండదు. పెట్టిన డబ్బులకు మంచి రాబడి వస్తుంది. మీకు వచ్చే రాబడి మీరు ఎంచుకున్న ఎఫ్‌డీ మెచ్యూరిటీ కాలంపై ఆధారపడి ఉంటుంది.

బ్యాంకులు ప్రస్తుతం 7 రోజుల దగ్గరి నుంచి పదేళ్ల కాల పరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు అందిస్తున్నాయి. మీరు మీకు నచ్చిన కాల వ్యవధిలో డబ్బులు ఎఫ్‌డీ చేయొచ్చు. మీరు ఎంచుకునే కాల పరిమితి ఆధారంగా మీకు వచ్చే వడ్డీ రేటు కూడా మారుతుంది. ఇంకా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఒక్కో బ్యాంక్ ఒక్కో రకమైన వడ్డీ రేటును అందిస్తుంటాయి.

Also Read:

అందువల్ల మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ముందు ఈ విషయాలు అన్నింటినీ గుర్తించుకోండి. లేదంటే తక్కువ రాబడి పొందాల్సి వస్తుంది. మీరు బ్యాంకులో డబ్బులు ఎఫ్‌డీ చేసినా తర్వాత మెచ్యూరిటీ కాలం వరకు ఆగాలి. తర్వాత మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి. వడ్డీ కూడా వస్తుంది.

అయితే ఇలా ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీ కాలం తీరిన తర్వాత మీరు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. లేదంటే మళ్లీ ఎఫ్‌డీని రెన్యూవల్ చేసుకోవచ్చ. రెన్యూవల్ చేసేటప్పుడు మళ్లీ జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకులు అప్పుడప్పుడు వడ్డీ రేట్లను సవరిస్తూ వస్తుంటాయి. అందువల్ల మీ ఎఫ్‌డీ రెన్యూవల్ సమయంలో మీరు బ్యాంకుకు వెళ్లి నచ్చిన కాల పరిమితిని ఎంచుకొని రెన్యూవల్ చేసుకోండి. ఆటోమేటిక్ రెన్యూవల్ చేస్తే మాత్రం మీకు నష్టం రావొచ్చు. ఇకపోతే ఎఫ్‌డీ డబ్బులు ముందే తీసుకుంటే పెనాల్టీ పడుతుంది. ఇంకా తక్కువ వడ్డీ వస్తుందని గమనించాలి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *