బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే ఎంత నష్టమో తెలుసా?చాలామంది ఉదయం వేళల్లో బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్ లేదా అల్పాహారం) తినకుండా డైరెక్టుగా భోజనం చేసేస్తుంటారు. దీనివల్ల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మిగిల్చామని చాలా ఆనందపడిపోతారు. ఈ పిసినారితనం వల్ల భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందనే సంగతి వారికి తెలీదు? పొదుపుతో మిగిలిన ఆ డబ్బే హాస్పిటళ్లకు, మందులకు ఖర్చైపోతాయి.

రాత్రంతా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచి తినే మొదటి ఆహారం ‘అల్పాహారం’. రాత్రి నుంచి ఉదయం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని ‘ఫాస్టింగ్’గా భావిస్తారు. అందుకే.. అల్పాహారాన్ని ‘బ్రేక్ ఫాస్ట్’ అని అంటారు. కాబట్టి.. ఉదయం టిఫిన్ మిస్ కావడం వల్ల కలిగే అనార్థలు, తినడం వల్ల కలిగే ఈ ప్రయోజనాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవల్సిందే.

ఈ రోజుల్లో ఆలస్యంగా నిద్రపోయి.. ఆలస్యంగా నిద్రలేవడం అలవాటుగా మారింది. కొందరికి షిఫ్టు డ్యూటీల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పట్టపగలు కూడా నిద్రపోవల్సి వస్తోంది. ఫలితంగా వీరు అల్పాహారాన్ని తీసుకోలేరు. దీంతో నిద్రలేచిన వెంటనే నేరుగా భోజనం చేసి మళ్లీ నిద్రపోయి.. సాయంత్రం షిఫ్టులకు వెళ్లిపోతారు. కొందరు బిజీ లైఫ్ వల్ల అల్పాహారం తీసుకోకుండా వెళ్లిపోతారు. ఇంకొందరు పొదుపు కోసం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్ చేస్తారు. రాత్రి నుంచి ఉపవాసం ఉంటూ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా 12 నుంచి 15 గంటలకు పైగా కడుపు మాడ్చేస్తుంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే..

Read Also:

✺ బ్రేక్ ఫాస్ట్ మిస్ కావడం వల్ల శరీరం తరచుగా అలసటకు గురవ్వుతుంది.
✺ కొన్ని రోజుల తర్వాత రక్తహీనత మొదలవుతుంది.
✺ శరీరం సహకరించకపోవడం వల్ల పనిమీద ఆసక్తి తగ్గిపోతుంది.
✺ చిరాకు పెరగడమే కాకుండా మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి.
✺ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ కావడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు.
✺ శరీరానికి అందే పోషకాలు.. ఉదయం వేళ తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ మీదే ఆధారపడి ఉంటుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనంలో తేలింది.

Read Also:

ప్రతి నాలుగు గంటలకు ఒకసారి తినాలి:
✺ మనం తీసుకున్న ఆహారం నాలుగు గంటల్లోగా జీర్ణం అయిపోతుంది.
✺ పగటి వేళ ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఆహారం తీసుకోవాలి.
✺ 6 గంటల సమయం గడిచిపోయినా ఆహారం తీసుకోకపోతే శరీరానికి అవసరమైన శక్తి అందదు.
✺ కనీసం 8 గంటల లోపు ఆహారాన్ని తీసుకోకపోతే.. కడుపులో మంట పుడుతుంది. ఇది క్రమేనా రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలకు దారి తీస్తుంది.
✺ సుదీర్ఘ సమయం పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో లోపించే పోషకాలను అల్పాహారం భర్తీ చేస్తుంది.
✺ రాత్రి బాగా తిని ఉద‌యం త‌క్కువ‌గా తినడం మంచిది కాదు.
✺ ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ ఎక్కువ‌గా తిని, రాత్రి పూట త‌క్కువ‌ తినడం ఉత్తమం.
✺ పిల్లలు, కౌమారంలో ఉన్నవాళ్లకు ఉదయం వేళ అల్పాహారం తప్పనిసరి.
✺ టీనేజ్‌ పిల్లలు బరువు, ఎత్తు ఒక దశలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది సక్రమంగా జరగాలంటే అల్పాహారం చాలా ముఖ్యం.
✺ పిల్లలు శారీర‌కంగా, మాన‌సికంగా అన్ని ర‌కాలుగా అభివృద్ది చెంద‌డానికి అల్పాహారం ఉపయోగపడుతుంది.
✺ మెద‌డు చురుగ్గా పనిచేయాలంటే.. తగిన అల్పాహారం తీసుకోవాలి. కాబట్టి.. బ్రేక్ ఫాస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *