భర్తని కత్తిపీటతో నరికి చంపిన భార్య.. గుంటూరులో దారుణం



జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్న భర్తని భార్య కిరాతకంగా హత్య చేసింది. కత్తిపీటతో నరికి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన అడపా రుద్ర రెడ్డి, ఉమ దంపతులు. మద్యానికి బానిసైన రుద్ర రెడ్డి ప్రతిరోజూ మద్యం తాగొచ్చి భార్యని వేధింపులకు గురిచేసేవాడు.

గత మూడు రోజుల నుంచి భర్త వేధింపులు ఎక్కువవడంతో భరించలేకపోయిన భార్య కత్తిపీటతో దాడి చేసింది. మద్యం మత్తులో ఉన్న భర్త రుద్ర రెడ్డిని విచక్షణా రహితంగా నరికేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *