భారత్ నుంచి వరల్డ్‌ బాక్సింగ్ ఛాంపియన్‌‌షిప్ ఔట్ఫురుషుల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కి వచ్చే ఏడాది ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని భారత్ కొద్దిలో చేజార్చుకుంది. 2017లో ఆతిథ్య హక్కులపై ఒప్పందం కుదుర్చుకున్న భారత్.. ఢిల్లీలో ఈ టోర్నీని నిర్వహించాలని ప్లాన్ చేసుకుంది. కానీ.. అగ్రిమెంట్ ప్రకారం గడువులోపు చెల్లించాల్సిన మొత్తాన్ని భారత బాక్సింగ్ ఫెడరేషన్‌ చెల్లించలేకపోవడంతో తాజాగా ఆ ఒప్పందాన్ని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోషియేషన్ రద్దు చేసింది.

ఒప్పందం ప్రకారం ఆతిథ్య నగరం ఢిల్లీ తరఫున భారత బాక్సింగ్ ఫెడరేషన్‌ గత ఏడాది డిసెంబరు 2 నాటికే రూ. 30 కోట్లు ఆతిథ్య ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంది. కానీ.. నిర్దేశించిన గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో.. ఆతిథ్య హక్కుల్ని తాజాగా సెర్బియాకి బదిలీ చేసిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోషియేషన్.. ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందున భారత్ 500 డాలర్లు క్యాన్షలేషన్ పెనాల్టీ కింద చెల్లించాలని ఆదేశించింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *