భార్యపై స్నేహితులతో గ్యాంగ్‌ రేప్.. భర్తే దగ్గరుండి మరీ దుర్మార్గంకట్టుకున్న భార్యని కిడ్నాప్ చేసి.. స్నేహితులతో చేయించిన అత్యంత అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సామూహిక చేసిన దుండగులు బాధితురాలిని రైల్వే ట్రాక్‌పై పడేసి వెళ్లిపోయారు. ఎలాగో అక్కడి నుంచి ఇంటికి చేరిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో చోటుచేసుకుంది.

ప్రభుత్వ అంబులెన్స్ సేవల విభాగంలో పని చేస్తున్న వ్యక్తికి 2016లో అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. పెళ్లైన కొద్దికాలానికే ఆమెకు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. భర్త నిత్యం ఆమెతో గొడవపడి కొడుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె 2018లో గర్భం దాల్చింది. కడుపుతో ఉందన్న కనీస కనికరం కూడా లేకుండా భర్త తీవ్రంగా కొట్టడంతో ఆమెకు గర్భస్రావమైంది. దీంతో భర్త వేధింపులు భరించలేక దూరంగా ఉంటోంది.

తన గర్భం పోవడానికి భర్తే కారణమని భార్య కేసు పెట్టింది. దీంతో ఇద్దరికీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. గత నెల 24న కౌన్సిలింగ్ సెంటర్‌కి వచ్చిన భార్యని కట్టుకున్న భర్తే కిడ్నాప్ చేశాడు. గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి బంధించి దారుణంగా రేప్ చేశాడు. అంతటితో ఆగని దుర్మార్గుడు తన ముగ్గు సహోద్యోగులతో గ్యాంగ్ రేప్ చేయించాడు. మత్తుమందిచ్చి రెండు రోజులపాటు నలుగురూ కలసి నరకం చూపించారు.

Also Read:

అనంతరం బాధితురాలిని జహనాబాద్‌ పరిధిలోని షాహి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద పడేసి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో ఎలాగో బయటపడ్డ బాధితురాలు తల్లితో కలసి పోలీసులను ఆశ్రయించింది. మత్తుమందిచ్చి నలుగురు సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Read Also:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *