భువనేశ్వర్ ‘ఫైనల్’ పంచ్‌కి వార్నర్ మైండ్ బ్లాక్



ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఆ టోర్నీ ఫస్ట్ ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్‌ని తాను ఔట్ చేస్తానని భారత్ ఫాస్ట్ బౌలర్ ధీమా వ్యక్తం చేశాడు. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న క్రికెటర్లు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్‌ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వార్నర్ తాజాగా లైవ్ సెషన్ నిర్వహించగా.. భువనేశ్వర్ కుమార్ గెస్ట్‌గా ఎంటరయ్యాడు. దీంతో.. అభిమానుల నుంచి కూడా వార్నర్ ప్రశ్నల్ని ఆహ్వానించాడు.

Read More:

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్‌ని ఊహిస్తూ ఓ అభిమాని అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నని భువీకి వార్నర్ సంధించగా.. భువీ ఫన్నీగా సమాధానమిచ్చి నవ్వు తెప్పించాడు. ‘‘టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయానికి చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉంది. నేను క్రీజులో ఉంటే నువ్వు ఏ బంతిని విసురుతావు..?’’ అని డేవిడ్ వార్నర్‌ ప్రశ్నించాడు.

వార్నర్ అడిగిన ప్రశ్నకి భువనేశ్వర్ సమాధానమిస్తూ ‘‘డేవిడ్ వార్నర్ చివరి ఓవర్‌లో నేను నీకు బౌలింగ్ చేయను. ఎందుకంటే.. ఆ మ్యాచ్ ఫస్ట్ ఓవర్‌లోనే నిన్ను ఔట్ చేస్తాను కదా..?’’ అని పంచ్ వేశాడు. ఊహించని ఆన్సర్‌తో డేవిడ్ వార్నర్‌కి ‌ఏం చెప్పాలో కొన్ని క్షణాలు అర్థంకాలేదు.

Read More:

వాస్తవానికి ప్రశ్న అడిగిన తర్వాత వార్నర్ ఓ హింట్ కూడా ఇచ్చాడు. నా అంచనా ప్రకారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బౌండరీ లైన్స్ దూరంగా ఉంటాయి కాబట్టి.. నకుల్ బాల్ సంధిస్తావని అనుకుంటున్నా అని చెప్పాడు. అయితే.. కెప్టెన్, సహచర బౌలర్ల అభిప్రాయాలు తీసుకుని ఆ తర్వాత ఫైనల్ బంతిపై తుది నిర్ణయం తీసుకుంటానని భువీ ఆఖరిగా వెల్లడించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *