భూకంపం వచ్చినా బెదరని న్యూజిలాండ్ ప్రధాని.. అలాగే ఇంటర్వ్యూ!కాళ్ల కింద భూమి కంపిస్తుంటే ఎలాంటి వారైనా ప్రాణభయంతో ఆరుబయటకి పరుగెత్తుతారు. కానీ, మాత్రం కాలు కదపలేదు. ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆమె.. తన ప్రసంగాన్ని యథావిధిగా కొనసాగించారు. పైగా పార్లమెంట్ భవనంలో భూమి కంపించింది చూశారా అంటూ మీడియా ప్రతినిధులతో చమత్కరించారు. న్యూజిలాండ్‌లో సోమవారం (మే 25) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. న్యూజిలాండ్ ప్రధానిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

న్యూజిలాండ్‌లో సోమవారం ఉదయం రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో దేశ ప్రధాని జెసిండా అర్డెర్న్‌ ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. తానున్న భవనం కుదుపులకు లోనవుతున్నా.. పెద్దగా ఆందోళనకు గురికాలేదు. తనదైన శైలిలో కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే.. ఆమె ధీమాకు బలమైన కారణమే ఉంది. పార్లమెంటు కాంప్లెక్సులో ఉండే ఆ భవనం భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించడమే అందుక్కారణం.

ఏదేమైనా భూమి కంపిస్తున్న సమయంలో ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం న్యూజిలాండ్ ప్రధానికే చెల్లింది. ఆ సమయంలో ఆమెలో ఎలాంటి భయంగానీ, ఆందోళనగానీ కనిపించలేదు. ‘నేను ఉన్న నిర్మాణం చాలా బలమైందనుకుంటా’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల రైళ్లు నిలిచిపోయినట్లు వెల్లడించారు. ‘పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్‌లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు తరచూ సంభవిస్తుంటాయి. 2011లో క్రైస్ట్‌చర్చ్‌ నగరంలో సంభవించిన భూకంపం 185 మందిని బలితీసుకుంది. భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రకంపనలను తట్టుకునే విధంగా నిర్మాణాలు చేపడతారు.

Also Read:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *