భోపాల్ నుంచి ఢిల్లీకి నలుగురి కోసం విమానం బుక్ చేసిన ఓ కుటుంబం!రెండు నెలల తర్వాత సోమవారం నుంచి దేశీయ పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భోపాల్ నుంచి ఢిల్లీకి ఎయిర్‌బస్ ఏ320 విమానం చేరుకోగా.. అందులో నలుగురు ప్రయాణికులే రావడం విశేషం. వీరిలో తల్లి, ఇద్దరు పిల్లు.. వారి పనిమనిషి కూడా ఉంది. 180 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానాన్ని ఓ వ్యాపారవేత్త కుటుంబం అద్దెకు తీసుకున్నట్టు సమాచారం. ఇందుకు రూ.10 లక్షలు వరకు ఖర్చుచేసినట్టు విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం 9.05 గంటలకు కేవలం పైలట్, క్యాబిన్ క్రూతో బయలుదేరి ఉదయం 10.30 గంటలకు భోపాల్ చేరింది. అక్కడ నలుగుర్ని ఎక్కించుకుని ఉదయం 11.30 గంటలకు తిరిగి బయలుదేరి 12.55కి ఢిల్లీకి చేరుకుంది. కరోనా మహమ్మారి సమయంలో ఇతరులతో కలిసి ప్రయాణించడం గురించి చాలామంది ముఖ్యంగా వ్యాపారవేత్తలు, కార్పొరేట్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారికి విమానయాన సంస్థలు, చార్టర్ విమానాలను ఆఫర్ చేస్తున్నాయి.

విమాన ప్రయాణానికి అతిపెద్ద నిర్వహణ వ్యయం అయిన ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఎటిఎఫ్) ధర ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నందున, తక్కువ ధరకే విమానాలను అద్దెకు ఇవ్వడానికి పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. చార్టెడ్ విమానం ఏ320కి అద్దె కింద గంటకు రూ.4-5 లక్షలు వసూలు చేస్తున్నాయి.. ఢిల్లీ-ముంబయి చార్టెడ్ విమానానికి రూ.16-18 లక్షలు ఖర్చవుతుంది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మే 21న యూరప్ నుంచి భారత్ రావడానికి ఓ చార్టెడ్ విమానం అద్దెకు తీసుకున్నారని, దీనికి సుమారు రూ.80 లక్షల ఖర్చవుతుందని విమాన సంస్థ వర్గాలు వెల్లడించాయి.

చార్టర్ విమానాల డిమాండ్ పెరిగింది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు ప్రైవేట్ చార్టర్లను నిర్వహించినట్లు బెంగళూరు విమానాశ్రయం తెలిపింది. ‘తక్కువ సంఖ్యలో ప్రయాణీకులు ఉన్నందున బెంగళూరు విమానాశ్రయంలోని ప్రైవేట్ చార్టర్లను సామర్థ్య పరిమితిలో చేర్చలేరు.. టెర్మినల్ ప్రాసెసింగ్‌పై గణనీయమైన ప్రభావం చూపదు’ అని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *