మందుబాబులకు గుడ్‌న్యూస్.. లాక్‌డౌన్‌లో డోర్ డెలివరీ.!మందుబాబులకు పశ్చిమ బెంగాల్‌లోని దీదీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ వేళ మద్యం దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. మందు దొరక్క కొందరు వింతగా ప్రవర్తిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యాన్ని నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేయాలని సీఎం మమత బెనర్జీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా మూతబడిన మద్యం దుకాణాలను తెరవకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న వారికి షాపు ద్వారా డెలివరీ చేయనున్నారు.

ఇందుకోసం హోం డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీస్ స్టేషన్ల నుంచి పాస్‌లు జారీ చేయనున్నారు. ఒక్కో షాపునకు మూడు డెలివరీ పాస్‌లు అందజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫోన్ల ద్వారా మద్యాన్ని ఆర్డర్ చేసుకుంటే సాయంత్రం ఐదు గంటలలోపు మద్యాన్ని డెలివరీ చేయనున్నట్టు ఎక్సైజ్ శాఖ తెలిపినట్లుగా ప్రచారం జరిగింది.

Also Read:

మద్యం డోర్ డెలివరీకి ప్రభుత్వం అనుమతించిందంటూ జోరుగా ప్రచారం సాగడంపై చీఫ్ సెక్రటరీ రాజీవ సిన్హా స్పందించారు. ఎక్సైజ్ శాఖ చెప్పినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ప్రభుత్వం నుంచి అలాంటి ఆదేశాలేవీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇటీవల స్వీట్ షాపులను పరిమిత సమయం అనుమతించినట్లుగానే మద్యం షాపులకు అనుమతులు ఇస్తారన్న చర్చ జోరందుకుంది.

లాక్‌డౌన్ కారణంగా మద్యం షాపులు మూసివేయడంతో పలుచోట్ల మందుబాబులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరికొందరు మద్యానికి బానిసై మతిస్థిమితం తప్పిపోయి వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రుల పాలయ్యారు. మరికొన్నిచోట్ల మద్యం తాగకుండా ఉండలేక ఏకంగా షాపులనే లూటీ చేశారు. లక్షల రూపాయల విలువైన మద్యాన్ని దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలో మమత సర్కార్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *