‘మన్మోహన్ సింగ్‌ను అడిగి తెలుసుకో’- రాహుల్‌కు నిర్మలమ్మ గట్టి కౌంటర్!దేశంలోని టాప్ 50 ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులకు సంబంధించిన రుణాలను ఆర్‌బీఐ టెక్నికల్‌గా రద్దు చేసిందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డిఫాల్టర్ల జాబితాలో చాలా మంది అధికార బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కాంగ్రెస్‌ ఆరోపణలు చేసింది. అందుకే దీనిపై తాను పార్లమెంటులోనే ప్రశ్నించినా ప్రభుత్వం దాటవేసిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్ కూడా చేశారు.

ఇప్పుడు రాహుల్ గాంధీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పటిస్తున్నారని మండిపడ్డారు. మొండి బకాయిల రైటాఫ్ గురించి రాహుల్ గాంధీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ఈ అంశాలకు సంబంధించిన ఆమె వరుస ట్వీట్లు కూడా చేశారు.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా () నిర్దేశించిన నాలుగేళ్ల ప్రొవిజనింగ్ చక్రం ప్రకారం.. మొండి బకాయిలకు కేటాయింపులు జరిగాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. పూర్తి కేటాయింపుల తర్వాత, బ్యాంకులు ఎన్‌పీఏలను రైటాఫ్ చేస్తాయని పేర్కొన్నారు. కానీ బ్యాంకులు మాత్రం లోన్ తీసుకున్న వారి నుంచి డబ్బులు రికవరీని కొనసాగిస్తాయని తెలిపారు. రుణం మాఫీ కాదని స్పష్టం చేశారు.

Also Read:

అలాగే నిర్మలా సీతారామన్.. విజయ్ మ్యాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ ముగ్గురికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి దాకా రూ.18,332 కోట్ల ఆస్తులను జప్తు చేశామని పేర్కొన్నారు. కాగా చెల్లించగలిగే సామర్థ్యం ఉండి కూడా తీసుకున్న రుణాలను కట్టకపోతే వారిని ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా పరిగణిస్తారు.

ఇకపోతే టాప్ 50 జాబితాలో.. గీతాంజలి జెమ్స్‌ ( మెహుల్ చోక్సీకి చెందిన సంస్థ) అత్యధికంగా రూ.5,492 కోట్ల బాకీలు చెల్లించాల్సి ఉంది. అలాగే ఆర్‌ఈఐ ఆగ్రో రూ. 4,314 కోట్లు, విన్‌సమ్‌ డైమండ్స్‌ రూ. 4,076 కోట్లు కట్టాల్సి ఉంది. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రూ.1,943 కోట్ల బాకీలతో 9వ స్థానంలో ఉంది. ఇక డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ రూ. 1,962 కోట్లు, ట్రాన్స్‌ట్రాయ్‌ రూ. 1,790 కోట్లు బాకీ పడ్డాయి. ఆర్‌టీఐ కార్యకర్త సాకేత్‌ గోఖలే ఫిబ్రవరి 16న ఎగవేతదారుల వివరాల కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేశారు. అయితే అప్పట్లో ఆ వివరాలు అందుబాటులో లేవని పేర్కొన్న రిజర్వ్‌ బ్యాంక్‌.. ఏప్రిల్‌ 24న రాతపూర్వక సమాధానం ఇచ్చింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *