మా బ్యాటింగ్‌ను చూసి కోహ్లీ కలవరపడ్డాడు: వార్న‌ర్‌గతేడాది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఓపెనింగ్‌కు దిగిన డేవిడ్ వార్న‌ర్‌-జానీ బెయిర్ స్టో సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో మ్యాచ్‌ల‌ను ఈ జంట.. త‌మ విధ్వంస‌కర ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో గెలిపించిన సంగ‌తి తెలిసిందే. ఇక రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ)తో హైద‌రాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించారు. ఇరువు‌రు చెరో సెంచ‌రీ న‌మోదు చేయ‌డంతో ఆర్సీబీపై ఘ‌న‌విజ‌యం సాధించింది. తాజాగా ఆ మ్యాచ్‌కు సంబంధించి ప‌లు విష‌యాల‌ను వార్న‌ర్ తెలిపాడు.

Must Read:
ఆర్సీబీతో మ్యాచ్‌లో బౌండ‌రీల వ‌ర‌ద పారించ‌డంతోపాటు వికెట్ల మ‌ధ్య వేగంగా ప‌రుగెత్తామ‌ని వార్న‌ర్ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో త‌మిద్ద‌రం క‌లిసి 21 లేదా 22 డబుల్స్ (రెండు ప‌రుగులు)ను సాధించామ‌ని గుర్తు చేసుకున్నాడు. తాము ప‌రుగుల జోరును చూసి ఆర్సీబీ కెప్టెన్ క‌ల‌వ‌రానికి గుర‌య్యాడ‌ని తెలిపాడు.

Must Read:
ఆ మ్యాచ్‌లో 56 బంతుల్లోనే 114 ప‌రుగులు చేసిన బెయిర్‌స్టో చివ‌ర్లో పెవిలియ‌న్‌కు చేరాడు. మ‌రోవైపు 55 బంతుల్లో స‌రిగ్గా వంద ప‌రుగులు చేసిన వార్న‌ర్ అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల‌తో 231 ప‌రుగులు చేసింది. అనంత‌రం చేధ‌నలో ఆర్సీబీ 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి.. 118 రన్స్‌తో ఓడిపోయింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *