మీకు తెలుసా? ఆల్కహాల్‌తో కూడా బరువు తగ్గొచ్చు.. ఆ డ్రింక్స్ ఇవే!రువు తగ్గించే ఆల్కహాల్ గురించి తెలుసుకొనే ముందు చిన్న విషయం తెలుసుకుందాం. మద్యపానం ఆరోగ్యానికి హానికరమే. ‘‘ప్రభుత్వమే మద్యాన్ని ఎనర్జీ డ్రింక్ తరహాలో అమ్మేస్తోంది. అదే నిజంగా హానికరమైనదైతే ప్రభుత్వం ఎందుకు అమ్ముతుంది?’’ అనే లాజిక్ ప్రశ్నలు చాలామంది వేస్తారు. జ్వరం వస్తే.. డాక్టర్లు టానిక్ లేదా మాత్రలు రాసిస్తారు. వాటిని కొద్దిగా మాత్రమే తీసుకోమని చెబుతారు. జ్వరం త్వరగా తగ్గిపోడానికి టానిక్‌ మొత్తాన్ని ఒకేసారి తాగేస్తే.. హాస్పిటల్ పాలవుతారు. శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి. ఆల్కహాల్ కూడా టానిక్‌లాంటిదే.. పరిమితిగా వాడితే ఆరోగ్యాన్ని ఇస్తుంది. అతిగా తాగితే అంతం చేస్తుంది. ఈ లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాలు తెరిచిన ఆనందంలో చాలామంది లివర్లు పాడైపోయేలా తాగేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. ఇప్పుడు మేటర్‌లోకి వెళ్తాం.

వాస్తవానికి ఆల్కహాల్‌లో కెలోరీల శాతం ఎక్కువ. అందుకే మద్యం అలావాటు ఉన్నవారు బరువు పెరుగుతుంటారు. దాని వల్ల ఆరోగ్యం కూడా క్రమేనా క్షీణిస్తుంది. ఇటీవల విడుదలైన ఓ సర్వే మాత్రం ఓ ఆసక్తికర విషయం చెప్పింది. బరువు తగ్గాలనుకునేవారు తక్కువ కెలోరీలు కలిగిన ఆల్కహాల్‌ను తీసుకోవచ్చట. లాన్సెట్ సర్వేలో వెల్లడించిన ఆల్కహాల్ రకాలేమిటో చూసేద్దామా!

1. లైట్ బ్లడీ మేరీ: ఈ డ్రింక్‌లో 200 నుంచి 400 కెలోరీలు ఉంటాయి. ఇందులో 30 ఎంఎల్ వోడ్కా, కొంచెం టమోటా జ్యూస్, వోర్సెస్టర్షైర్, టబాస్కో సాస్‌లు మిక్స్ చేసి తీసుకున్నట్లయితే. కెలోరీల కౌంట్ 100 కంటే తక్కువగా ఉంటాయి.

2. వొడ్కా సొడా: క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను ఇష్టపడేవారికి ఈ డ్రింక్ బాగా నచ్చుతుంది. ఇందులో టానిక్ వాటర్‌ను కలపవద్దు. అది కలిపితే అదనంగా 80 కెలోరీలు కలుస్తాయి. దానికి బదులు సోడా వాటర్‌ను వొడ్కాలో కలపండి. టేస్ట్ కోసం కాస్త నిమ్మరసాన్ని కలపండి. ఆల్కహాల్ మిమ్మల్ని డీహైడ్రేడ్‌కు గురిచేస్తుంది. అయితే, సోడా వాటర్ కలపితే ఎలాంటి సమస్య ఉండదు. ఈ వోడ్కా సోడా డ్రింక్‌లో కెలోరీల సంఖ్య 96 మాత్రమే ఉంటాయి.

3. టెకిలా: బరువు, సుగర్ స్థాయిలు తక్కువగా ఉండే ఆల్కహాల్‌ను ఎంజాయ్ చేయాలంటే.. మెక్సికన్ కాక్‌టైల్‌ను ట్రై చేయండి. నిమ్మకాయ రసం కలిపిన టకీలాను తాగి చూడండి. నిమ్మరసం వల్ల ఈ డ్రింక్ మరింత టేస్టీగా ఉంటుంది. ఇందులో కెలోరీల సంఖ్య 200 కంటే తక్కువగానే ఉంటుంది.

Also Read:

4. మొజిటో: ఈ డ్రింక్‌లో 168 కెలోరీలు ఉంటాయి. వీలైనంతవరకు ఇందులో సిరప్ కలపకుండా తాగేందుకు ప్రయత్నిచండి. సిరప్‌కు బదులుగా కాస్త రమ్ కలిపితే సుమారు 100 కెలోరీలను తగ్గించవచ్చు. పుదీనా ఆకులు, సోడా, నిమ్మరసం కలిపితే మరింత టేస్టీగా ఉంటుంది. ఇందులో కెలోరీల సంఖ్య 100 కంటే తక్కువే.

Also Read:

5. లైట్ బీర్: బీర్లు తాగితే నడుము వద్ద కొవ్వు పెరుగుతుందని చాలామంది భావిస్తారు. అలాంటి భయం ఉంటే.. లైట్ బీర్ ట్రై చేయండి. దాని వల్ల మీకు ఎలాంటి సమస్య ఉండదు. రెగ్యులర్ బీర్లతో పోల్చితే లైట్ బీర్‌లో 50 కెలోరీలు తక్కువ ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఈ డ్రింక్ మంచిదే. ఇందులో 103 కిలోరీలు మాత్రమే ఉంటాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *