మెరిసిన హైదరాబాద్ బౌలర్లు.. 120 స్కోరుతో సరిపెట్టిన బెంగళూరుఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మరోసారి సమష్టిగా రాణించారు. షార్జా వేదికగా శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు సందీప్ శర్మ (20/2), జేసన్ హోల్డర్ (2/27), నటరాజన్ (1/11) మెరవడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 7 వికెట్ల నష్టానికి 120 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో ఓపెనర్ జోష్ ఫిలిప్పీ (32: 31 బంతుల్లో 4×4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. బెంగళూరు ఇన్నింగ్స్ ప్రారంభించిన దేవదత్ పడిక్కల్ (5: 8 బంతుల్లో 1×4), జోష్ ఫిలిప్పీ (32: 31 బంతుల్లో 4×4) జోడీ ఆరంభం నుంచి భారీ షాట్ల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌‌లోనే పడిక్కల్‌ని సందీప్ శర్మ క్లీన్ బౌల్డ్ చేయగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీ (7: 7 బంతుల్లో) కూడా సందీప్‌కే వికెట్ సమర్పించుకున్నాడు. ఈ దశలో జోష్ ఫిలిప్పీ‌తో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్‌ని ఏబీ డివిలియర్స్ (24: 24 బంతుల్లో 1×4, 1×6) చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఏబీ వ్యక్తిగత స్కోరు 4 వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌ని జారవిడిచిన నదీమ్.. ఎట్టకేలకి మళ్లీ అతడ్ని ఔట్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఇక చివర్లో వాషింగ్టన్ సుందర్ (21: 18 బంతుల్లో 2×4), గుర్‌కీరత్ సింగ్ మన్ (15 నాటౌట్: 24 బంతుల్లో 1×4) కొన్ని ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. వేగంగా ఆడలేకపోయారు. క్రిస్ మోరీస్ (3), ఇసురు ఉదాన (0) కూడా తేలిపోవడంతో బెంగళూరు 120 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *