మోదీ షాక్: వర్కింగ్ అవర్స్ పెంపు? రోజుకు 12 గంటలు పని చేయాలా?కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతోందా? వర్కింగ్ అవర్స్‌ను పెంచాలనే యోచనలో ఉందా? పని గంటలను 8 నుంచి 12కు పెంచాలని భావిస్తోందా? వెలువడుతున్న నివేదికలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల కార్మికుల కొరత ఏర్పడింది. దైనందిన నిత్యవసర ప్రొడక్టులకు మాత్రం డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం 3 నుంచి 5 నెలల పాటు పని గంటలను పెంచాలని యోచిస్తోంది. దీని కోసం చట్టాలను కూడా మార్చాలని భావిస్తోంది. దీంతో రాష్ట్రాలకు పని గంటలు పెంచుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది.

Also Read:

ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం పని గంటల మార్పునకు ఆర్డినెన్స్ తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దీన్ని అమలు చేయొచ్చు. ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలను పెంచుకోవడానికి వీలవుతుంది. కంపెనీలు షిఫ్ట్‌ టైమింగ్స్ కూడా పెంచుకోవచ్చు. ప్రస్తుతం రోజుకు 8 గంటలు పని చేయొచ్చు. వారానికి ఆరు రోజులు పని చేయాల్సి ఉంటుంది.

Also Read:

ఒకవేళ కొత్త రూల్స్ వస్తే మాత్రం రోజుకు 12 గంటలు పని చేయాల్సి రావొచ్చు. అంటే వారానికి 48 గంటలు కాకుండా 72 గంటలు పని చేయాల్సి వస్తుంది. దీని కోసం ఫ్యాక్టరీస్ చట్టం 1948కు సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత చట్టాల ప్రకారం.. ఫ్యాక్టరీల్లో యుక్త వయసు వారు బలవంతంగా పని చేయడానికి వీలు లేదు. అలాగే వారానికి 48 గంటలకు మించి ఎక్కువ పని చేయకూడదు.

కంపెనీలు, ఇతర సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని పని గంటలు పెంచాలని కోరినట్లు తెలుస్తోంది. దీని వల్ల కార్మికుల కొరత కొంత తగ్గుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. చాలా మంది కార్మికులు ఇళ్లకు, సొంతూర్లకు వెళ్లిపోయిన పరిస్థితుల్లో పని గంటల నిర్ణయం వల్ల ప్రయోజనం కలుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంటుందా? లేదా? ఒకవేళ తీసుకుంటే.. ఎవరెవరికీ వర్తంపజేస్తుంది? వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *