రవిశాస్త్రి.. కుల్దీప్ విషయంలో ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటారా?: హర్భజన్డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టులో భారత జట్టులో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ విషయమై హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. అశ్విన్, జడేజాలను కాదని కుల్దీప్‌కు అవకాశం దక్కుతుందని తాను భావించడం లేదన్నారు.

2019 జనవరిలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన చివరి టెస్టులో ఐదు వికెట్ల హాల్ సాధించాడు. ఆ టైంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. విదేశీ టెస్టుల్లో కుల్దీప్ యాదవ్ తమ ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్ అని తెలిపాడు. శాస్త్రి ఆ కామెంట్ చేసిన దాదాపు రెండేళ్ల తర్వాత భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ విషయమై హర్భజన్ మాట్లాడుతూ.. ఇప్పటికీ కుల్దీప్ విషయంలో రవిశాస్త్రి అదే మాటకు కట్టుబడి ఉంటాడేమో చూడాలన్నాడు.

గత ఏడాది కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో కుల్దీప్ ప్రదర్శన ఆకట్టుకునేలా లేదు. దీంతో అతడికి భారత జట్టులో చోటు దక్కలేదు. అందుకే అడిలైడ్ టెస్టులో కుల్దీప్‌కు చోటు దక్కే విషయమై హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘2019 వరల్డ్ కప్ తర్వాత కుల్దీప్ ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్ 2020లో ఆడినా కొన్ని మ్యాచ్‌ల్లోనే బరిలో దిగాడు. కుల్దీప్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబడతారో చూడాలి’’ అని భజ్జీ వ్యాఖ్యానించాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *