రాహుల్ ఫస్ట్ ఛాయిస్ కీపర్.. పంత్ దేశవాళీలో ఆడుకో..!: వెటరన్ కీపర్వన్డే, టీ20ల్లో ప్రస్తుతం భారత్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ అని వెటరన్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో హెల్మెట్‌కి బంతి బలంగా తాకడంతో మ్యాచ్ మధ్యలోనే రిషబ్ పంత్ తప్పుకోగా.. అనూహ్యంగా కీపింగ్ బాధ్యతలు అందుకున్న కేఎల్ రాహుల్.. స్టంపౌట్‌లో ధోనీని తలపించాడు. దాంతో.. ఆ తర్వాత మ్యాచ్‌కి పంత్ ఫిట్‌నెస్ సాధించినా.. రాహుల్‌నే కీపర్‌గా కొనసాగించిన టీమిండియా మేనేజ్‌మెంట్.. న్యూజిలాండ్ పర్యటన మొత్తం పంత్‌కి మొండిచేయి చూపింది.

ఓపెనర్‌గా, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా జట్టు అవసరాలకి అనుగుణంగా బ్యాటింగ్ ఆర్డర్‌ని మార్చుకున్న కేఎల్ రాహుల్.. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో పాటు కీపింగ్‌లోనూ మెరిశాడు. ముఖ్యంగా వన్డే సిరీస్‌లో ధోనీ తరహాలో ఫినిషర్ పాత్రని పోషించాడు. దాంతో.. ధోనీకి తగ్గ వారసుడు రాహుల్ అని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడగా.. టీ20 వరల్డ్‌కప్‌లోనూ అతడ్నే కీపర్‌గా కొనసాగించాలని అప్పటి నుంచే డిమాండ్లు మొదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉంది.

‘‘టీ20 వరల్డ్‌కప్ గురించి మాత్రమే ఆలోచిస్తే..? నా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్. ఆ టోర్నీలో రాహుల్ మెరుగ్గా ఆ బాధ్యతలు నిర్వర్తించగలడని నేను నమ్ముతున్నా. ఇందులో ఎలాంటి సందేహాల్లేవ్. ఇక రిషబ్ పంత్ అంటారా..? ఫామ్ కోల్పోయినప్పుడు లేదా కీపర్‌గా లయ తప్పినప్పుడు నేను దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు మొగ్గు చూపేవాడ్ని. రిషబ్ పంత్‌కి అదే విషయం చెప్పా. అతనిలో టాలెంట్ ఉంది. కాబట్టే అందరూ మాట్లాడుకుంటున్నారు’’ అని పార్థీవ్ పటేల్ వెల్లడించాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *