రిషి కపూర్ మృతిపై ప్రధాని మోదీ ట్వీట్బాలీవుడ్‌ ప్రముఖ నటుడు రిషీకపూర్‌ బుధవారం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను బుధవారం రాత్రి ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 8:45లకు ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రిషి కపూర్ మృతిపై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖలంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భారత చలన చిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటన్నారు.
ప్రధాని మోదీ సైతం రిషికపూర్ మరణ వార్తపై స్పందించారు. ట్విట్టర్ వేదికాగా ఆయన తన బాధను వ్యక్తం చేశారు.

‘బహుముఖ ప్రజ్ఞాశాలి, మనోహరం, ఉల్లాసవంతంగా ఉండే మనిషి రిషీ కపూర్. అతను ప్రతిభకి పెద్ద శక్తిలా ఉండేవారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గతంలో ఆయనతో జరిగిన సంభాషణలను గుర్తు చేసుకుంటూ ఉంటాను. సినిమాలే కాక భారతదేశం పురోగతి పట్ల ఎంతో కూడా ఆయన మక్కువ చూపించారు. అతని మరణం నన్ను చాలా బాధకి గురి చేసింది. ఆయన కుటుంబానికి, అభిమానులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఓంశాంతి’ అని మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాష్ట్రపతి సైతం రిషికపూర్ మరణ వార్తపై స్పందించారు. రిషికపూర్‌ ఆకస్మిక మరణం షాక్‌కు గురిచేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. ఎల్లప్పుడూ నవ్వు ముఖంతో ఉండే ఎవర్ గ్రీన్ స్టార్ హీరో ఇక లేరంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. సినీ రంగానికి తీరని లోటన్నారు. రిషికపూర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానంటూ ట్విటర్ ద్వారా సందేశం పోస్ట్ చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. కూడా హిందీ సినిమా సీనియర్ నటుడు రిషి కపూర్ అకాల మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఆయన బహుముఖ నటనా ప్రతిభతో దశాబ్దాలుగా భారతీయ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారని కొనియాడారు. సంతాపం తెలియజేస్తూ వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *