రైతులకు కేంద్రం ఝలక్.. వీరికి ఆ బెనిఫిట్ ఉండదు!కేంద్ర ప్రభుత్వం రుణ గ్రహీతలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. లోన్ మారటోరియం గడువులో వడ్డీ మీద వడ్డీ మాఫీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇక్కడ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని రుణాలకు మాత్రమే వడ్డీ మీద వడ్డీ మాఫీ బెనిఫిట్ అందిస్తోంది.

మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు లోన్ మారటోరియం కాలానికి వడ్డీ మీద వడ్డీ మాఫీ బెనిఫిట్ లభిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని రకాల రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎంఎస్ఎంఈ రుణాలు, ఎడ్యుకేషన్ లోన్, హౌసింగ్ లోన్, కన్సూమర్ డ్యూరబుల్ లోన్, పర్సనల్ లోన్, ప్రొఫెషనల్స్ అండ్ కన్షప్షన్ రుణాలకు వడ్డీ మీద వడ్డీ మాఫీ బెనిఫిట్ ఉంటుంది.

Also Read:

అయితే కొన్ని రకాల రుణాలకు మాత్రం వడ్డీ మీద వడడీ మాఫీ వర్తించదు. వ్యవసాయ, వ్యవసాయ సంబంధిత రుణాలకు వడ్డీ మీద వడ్డీ మాపీ వర్తించదు. అలాగే క్రాప్ లోన్, ట్రాక్టర్ లోన్స్ వంటి వాటికి కూడా ఈ ప్రయోజనం అందుబాటులో ఉండదు. దీంతో వీరిపై ప్రతికూల ప్రభావం పడనుంది.

కాగా రూ.2 కోట్ల వరకు రుణాలకు మాత్రమే ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీ మీద వడ్డీ మాఫీ బెనిఫిట్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. అర్హత కలిగిన రుణ గ్రహీతలందరికీ ఎక్స్‌గ్రేషియా స్కీమ్ డబ్బులు నేరుగా అకౌంట్‌లోకి వచ్చి చేరతాయి. దీని కోసం ప్రత్యేకంగా దరఖాస్తు కూడా చేసుకోవలసిన అవసరం లేదు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *