రైతులకు శుభవార్త.. మరో 3 నెలలు బ్యాంకులకు డబ్బులు కట్టక్కర్లేదు!



కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి పలు రకాల స్కీమ్స్‌ను అందిస్తోంది. ఈ పథకాల్లో కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) కూడా ఒకటి. కేసీసీ స్కీమ్ కింద రైతులు తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు. ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. రైతులు మూడేళ్లలో రూ.5 లక్షల వరకు లోన్ తీసుకునే ఛాన్స్ ఉంది.

కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై వడ్డీ రేటు కేవలం 4 శాతం మాత్రమే. అయితే ఇది అందరికీ వర్తించదు. తీసుకున్న రుణాలను కరెక్ట్ టైమ్‌కు కడితేనే తక్కువ వడ్డీ పడుతుంది. మార్చి 31లోపు రుణాన్ని చెల్లించాలి. అయితే కేంద్రం ఇదివరకు ఈ డెడ్‌లైన్‌ను మే 31 వరకు పొడిగించింది. అంటే మార్చి 31లోపు కాకుండా మే 31 లోపు రుణాన్ని చెల్లించినా కూడా తక్కువ వడ్డీనే పడుతుంది.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మే 31 గడువును ఆగస్ట్ నెల వచివరి వరకు పొడిగించే అవకాశముంది. రిజర్వు బ్యాంక్ ఇప్పటికే గడువు పొడిగింపునకు అనుమతినిచ్చింది. అయితే ఆదేశాలు మాత్రం బ్యాంకులకు చేరలేదు. త్వరలోనే బ్యాంకులు కూడా ఈ గడువును ఆగస్ట్ చివరకు పొడిగించనున్నాయి.

Also Read:

కేసీసీ లోన్స్‌పై సాధారణంగా 9 శాతం వడ్డీ పడుతుంది. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం 2 శాతం సబ్సిడీ అందిస్తుంది. అప్పుడు వడ్డీ రేటు 7 శాతానికి తగ్గుతుంది. ప్రతి ఏడాది తీసుకున్న రుణాన్ని గడువులోగా చెల్లిస్తూ వస్తే.. మరో 3 శాతం వడ్డీ తగ్గుతుంది. అంటే మొత్తంగా చూస్తే కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై వడ్డీ రేటు 4 శాతం అవుతుంది.

సాధారణంగా బ్యాంకులు మార్చి 31లోపు తీసుకున్న రుణాన్ని చెల్లించాలని రైతులను కోరతాయి. ఈలోపు లోన్ చెల్లిస్తే 4 శాతం వడ్డీ పడుతుంది. లేదంటే 7 శాతం వడ్డీ చెల్లించాలి. ఇకపోతే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణ మొత్తాన్ని ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ సహా పలు ఇతర బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు వంటివి కిసాన్ కార్డులను జారీ చేస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *