లడఖ్ చైనాలో ఉందా: ట్విటర్‌కు భారత్ వార్నింగ్సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ తీరుపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లోని లేహ్‌ () పట్టణాన్ని చైనాలో చూపించే విధంగా ఉన్న ట్విటర్‌ లొకేషన్ సెట్టింగ్‌లపై అసహనం వ్యక్తం చేసింది. వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ సంస్థకు సూచించింది. ‘భారతీయుల మనోభావాలను గౌరవించండి’ అంటూ ఆ సంస్థను హెచ్చరించింది.

భారత పటాన్ని తప్పుగా చూపడంపై కేంద్ర ప్రభుత్వ నిరసనను వ్యక్తం చేస్తూ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ట్విటర్ సీఈఓ జాక్‌ డోర్సేకు లేఖ రాసినట్లు ప్రభుత్వ వర్గాలు గురువారం (అక్టోబర్ 22) వెల్లడించాయి.

‘భారత సమగ్రత, సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. చివరికి అది మ్యాపుల్లో అయినా సహించేదిలేదు. అలా చేయటం చట్టవిరుద్ధం కూడా. అలాంటి తీరు ట్విటర్‌కు అపఖ్యాతిని తీసుకురావడమే కాకుండా, సంస్థ స్థిరత్వంపై సందేహాలు తలెత్తుతాయి’ అని ట్విటర్ సంస్థకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అసలేం జరిగింది?
ఇటీవల జాతీయ భద్రతా విశ్లేషకులు నితిన్ గోఖలే.. లేహ్‌లోని అమరవీరుల చిహ్నమైన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ వద్ద ట్విటర్ వేదికగా లైవ్ షూట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ట్విటర్ వీడియోలో లొకేషన్ ట్యాగ్ చైనాలో ఉన్నట్లు కనిపించింది. కొంత మంది నెటిజన్లు వెంటనే ఆ తప్పును గుర్తించారు. ట్విటర్ చర్యను విమర్శిస్తూ కామెంట్లు, మీమ్స్ పెట్టారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల గూగుల్‌లోనూ ఇలాంటి చిత్ర విచిత్రాలే వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *