లాక్‌డౌన్ నిబంధనలను నీరుగార్చే ప్రయత్నం చేయొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలాక్‌డౌన్ 4.0లో మరిన్ని సడలింపులను ఇచ్చిన కేంద్రం.. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తూ.చ. తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. కేంద్రం వెల్లడించిన మార్గదర్శకాలను అనుసరించి, ఆంక్షలను సడలించాలని సూచించింది. వీటిని నీరుగార్చే ప్రయత్నాలు చేయరాదని పేర్కొంది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రాలు నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది. అవసరమని భావించిన పరిమితులను విధించవచ్చని, ఇతర కార్యకలాపాలను నిషేధించవచ్చని తెలిపింది. కోవిడ్-19 నిర్వహణ కోసం జాతీయస్థాయి మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా అమలులో ఉంటాయని పునరుద్ఘాటించింది.

బయటకు వచ్చేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా భౌతికదూరం, మాస్క్ ధరించడం నిబంధనలను పాటించాలని పేర్కొంది. అలాగే, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం శిక్షార్హమని ఉద్ఘాటించింది. జోన్ల వారీగా ఆంక్షల అమల్లో రాజీ పడొద్దని వెల్లడించింది. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు లేఖ రాశారు.

పరిస్థితులను మదింపు చేసి వేర్వేరు జోన్లలో అవసరమైతే ఆంక్షలను కఠినతరం లేదా సులభతరం చేయాలి. తాజా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కోరుతున్నా అని అన్నారు.

దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్‌డౌన్-4లో మరిన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కంటైన్మెంట్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే అప్పగించింది.

కరోనా హాట్‌స్పాట్లలో ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది. రాష్ట్రాల పరస్పర అనుమతితో అంతర్రాష్ట బస్సు సర్వీసులకు నడుపుకోవచ్చునని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ప్రేక్షకులు లేకుండా క్రీడా మైదానాలను తెరుచుకోవచ్చునని తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు మే 31 వరకు మూసివేసి ఉంచాలని పేర్కొంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *