వరల్డ్‌కప్‌లో భారత్‌ని పాక్ ఓడించలేకపోవడానికి కారణమిదే: రజాక్వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ భారత్, జట్లు ఏడుసార్లు తలపడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయాన్ని అందుకుంది. ప్రతిసారి భారత్‌ని ఓడిస్తామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పాక్ బరిలోకి దిగడం.. ఆఖరికి ఒత్తిడిని జయించలేక చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. అలా పాకిస్థాన్ ఓడిపోతుండటానికి తాజాగా కారణాల్ని విశ్లేషించిన రజాక్.. 2011 వరల్డ్‌కప్‌లో గెలిచే అవకాశాన్ని పాక్ చేజార్చుకుందని చెప్పుకొచ్చాడు.

‘‘భారత్‌తో షార్జా వేదికగా జరిగిన కొన్ని వన్డే మ్యాచ్‌ల్లో పాక్ విజయం సాధించింది. అలానే కెనడాలోనూ ఓ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియాపై పాక్ గెలుపొందింది. కానీ.. వరల్డ్‌కప్‌లో మాత్రం పాక్‌ని నిరాశే ఎదురవుతోంది. దానికి కారణం మ్యాచ్‌కి ముందే ప్రజల అంచనాలు, మీడియా కథనాలు. 1999 వన్డే ప్రపంచకప్‌లో మ్యాచ్‌కి ముందే మీడియా కారణంగా పాక్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. అలానే 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ దాయాది మ్యాచ్‌‌పై ప్రత్యేకంగా చర్చ జరిగింది. దాంతో.. భారత్‌ని ఓడించగలమనే ఆత్మవిశ్వాసం పాక్ ఆటగాళ్లలో లేకపోయింది. మ్యాచ్‌కి ముందే పాక్ క్రికెటర్లు ఒత్తిడిలోకి వెళ్లిపోయారు’’ అని రజాక్ వెల్లడించాడు.

2011 వన్డే ప్రపంచకప్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 231 పరుగులకి ఆలౌటైంది. దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో.. భారత్, పాక్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *