వికారాబాద్‌లో కారు బీభత్సం.. బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు మృతివికారాబాద్‌ జిల్లాలో ఘోర చోటుచేసుకుంది. బైక్‌ని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. శుభకార్యానికి బయల్దేరి మార్గంమధ్యలోనే దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేటకి చెందిన ఆనంద్ హైదరాబాద్‌కి వలస వచ్చి మేస్త్రీగా పనిచేస్తున్నాడు.

హైదరాబాద్ నుంచి జిల్లా పూడూరులో మేనకోడలు నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు భార్యతో కలసి బైక్‌పై బయల్దేరాడు. కొద్దిసేపట్లో పూడూరు చేరుకునేలోపే మృత్యువు దూసుకొచ్చింది. వేగంగా వచ్చిన కారు ఆనంద్ దంపతుల బైక్‌ని వెను నుంచి బలంగా ఢీకొట్టింది. కారు ఢీకొన్న ధాటికి దంపతులిద్దరూ ఎగిరి కిందపడ్డారు. రోడ్డుపై పడిపోవడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మరణించారు.

Read Also:

శుభకార్యానికి బయల్దేరిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడడం తీవ్రంగా కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ప్రమాదంపై ఆరా తీశారు. దంపతుల మరణంతో స్వగ్రామం నాగర్ కర్నూల్‌ జిల్లా కొత్తపల్లిలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *