విరాట్ కోహ్లీపై అందుకే స్లెడ్జింగ్‌కి దిగకూడదు: డీన్ జోన్స్భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీపై స్లెడ్జింగ్‌‌కి దిగకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనకి 2018-19లో టీమిండియా వెళ్లగా.. ఆ టెస్టు సిరీస్‌లో కోహ్లిపై కంగారులు ఎలాంటి కవ్వింపులకి దిగలేదు. ఐపీఎల్‌లో తమ కాంట్రాక్ట్‌లను కాపాడుకునేందుకే ఆస్ట్రేలియా క్రికెటర్లు కోహ్లీపై ఆ సిరీస్‌లో స్లెడ్జింగ్‌కి దిగలేదని ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆరోపించాడు.

కోహ్లీపై ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్లెడ్జింగ్‌ చేయకపోవడానికి ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు కారణం కాదని తాజాగా వివరణ ఇచ్చిన డీన్‌ జోన్స్.. గతంలో కొంత మంది క్రికెటర్లపై కంగారూలు అదే తరహాలో జాగ్రత్తగా వ్యవహరించడాన్ని గుర్తు చేశాడు. ‘‘విరాట్ కోహ్లీపై అప్పట్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు మౌనంగా ఉండటానికి గల కారణాన్ని నేను ఇప్పుడు చెప్తాను. గతంలో వివియన్ రిచర్డ్స్ బ్యాటింగ్‌కి వస్తే..? మేము సైలెంట్‌గా ఉండేవాళ్లం. అలానే జావెద్ మియాందాద్, మార్టిన్ క్రౌ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించేవాళ్లం. ఎందుకంటే.. వాళ్లని రెచ్చగొడితే ఆ తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కోహ్లీ కూడా అలానే. అందుకే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆ సిరీస్‌లో కోహ్లీపై స్లెడ్జింగ్‌కి దిగలేదు’’ అని డీన్ జోన్స్ వెల్లడించాడు.

ఐపీఎల్ కాంట్రాక్ట్‌లను కాపాడుకునేందుకు కోహ్లీతో జాగ్రత్తగా వ్యహరించారనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పుకొచ్చిన డీన్ జోన్స్.. ఐపీఎల్‌లో ఆడకుండా ఏ క్రికెటర్‌ని ఆపలేడని వెల్లడించాడు. ఈ ఏడాది చివర్లో భారత్ జట్టు నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లబోతోంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *