వీడియో: యువతిపైకి దూసుకొచ్చిన టైరు.. లక్కీగా తప్పించుకున్నా, వెంటాడిన దురదృష్టంబ్రెజిల్‌లో వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. దాని కారు టైరు ఊడి ఫుట్‌పాత్‌పై నడుచుకుని వెళ్తున్న యువతిపై దూసుకెళ్లింది. అయితే, ఆమె దాని నుంచి తప్పించుకుంది. కానీ, దురదృష్టం మరోలా వెంటాడింది. బస్టాప్‌లో ఉన్న స్తంభానికి తగిలి.. ఆ టైరు ఆమెను వెనుక నుంచి తాకింది. ఆ దెబ్బకు ఆమె ఫుట్‌పాత్‌పై పడిపోయింది. అటుగా వెళ్తున్న పాదచారులు ఆమెను పైకి లేపి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *