వీవీఎస్ సహనం కోల్పోయిన వేళ.. ఓజాపై అరిచేశాడు : రైనాభారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కి వివాదరహితుడనే పేరుంది. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు సహచరులతోనూ హుందాగా వ్యవహరించిన లక్ష్మణ్.. ఏ రోజూ క్రమశిక్షణ తప్పలేదు. అయితే.. ఓసారి మాత్రం సహచర క్రికెటర్ ప్రగ్యాన్ ఓజాపై కోప్పడినట్లు తాజాగా సురేశ్ రైనా వెల్లడించాడు.

ఆస్ట్రేలియాతో మొహాలి వేదికగా 2010లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 216 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు.. ఒకానొక దశలో 124/8తో ఓడిపోయేలా కనిపించింది. కానీ.. టెయిలెండర్ ఇషాంత్ శర్మతో కలిసి 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వీవీఎస్ లక్ష్మణ్.. టీమిండియాకి అనూహ్య విజయాన్ని అందించాడు. అయితే.. ఇషాంత్ శర్మ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన ఓజా.. పరుగు విషయంలో తత్తరపాటుకి గురవుతుండటంతో లక్ష్మణ్ అతనిపై కోప్పడినట్లు రైనా వెల్లడించాడు.

‘‘వీవీఎస్ లక్ష్మణ్ ఆ మ్యాచ్‌లో వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దాంతో.. అతనికి నేను రన్నర్‌గా వెళ్లాను. ఓజా బాగానే బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. కానీ.. అనవసరంగా ఆఖర్లో పరుగు కోసం పదే పదే ప్రయత్నించడంతో.. లక్ష్మణ్ అతనిపై కోప్పడ్డాడు. అప్పటి వరకూ వీవీఎస్ కోపాన్ని నేను చూడలేదు. ఓజా తొందరపాటు కారణంగా నేను కూడా ఓసారి పరుగుకి వెళ్లగా.. ఫీల్డర్ మైకేల్ హస్సీ బంతిని వికెట్లపైకి విసిరాడు. దాంతో.. లక్ష్మణ్ ఔట్ కాకూడదని నేను డైవ్‌ చేశాను’’ అని రైనా వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో లక్ష్మణ్ 79 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలవగా.. ఓజా 5 పరుగులతో సపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత బెంగళూరు టెస్టుని కూడా గెలిచిన భారత్ సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *