శుక్రవారమే తెరుచుకున్న ఒప్పో ప్లాంట్‌.. ఆరుగురికి కరోనాా పాజిటివ్నొయిడాలోని చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ ఒప్పో పరిశ్రమలో కలకలం రేగింది. పరిశ్రమలో పనిచేసే ఆరుగురు ఉద్యోగులకు వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ ఫ్యాక్టరీని మూసేసిన యాజమాన్యం… ప్లాంట్‌లో పనిచేస్తున్న 3,000 మంది ఉద్యోగులను కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం తరలించారు. పరిశ్రమలో కార్యకలాపాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్లాంట్‌ శుక్రవారమే తెరుచుకుంది. అయితే, అంతలోనే కరోనా వైరస్ కలకలం రేగడం గమనార్హం. విధులకు హాజరైన ఉద్యోగుల నమూనాలను సేకరించి కు కరోనా వైరస్ పరీక్షలకు పంపినట్టు అధికారులు తెలిపారు.

‘ఉద్యోగులు, పౌరుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యం.. అందుకే గ్రేటర్ నోయిడాలోని యూనిట్‌లో కార్యకలాపాలను నిలిపివేశాం.. 3,000 మంది ఉద్యోగులకు కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నాం. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. ఉద్యోగులను సురక్షితంగా ఉంచడానికి, ఫ్యాక్టరీ ఆవరణలో వైరస్ లేకుండా చేసేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నాం’ అని ఒప్పో ఇండియా ఓ ప్రకటన వెలువరించింది.

కరోనా వైరస్ పరీక్షల్లో నెగిటీవ్ వచ్చిన సిబ్బందినే విధులకు అనుమతించనున్నారు. విధుల్లో చేరిన తర్వాత కూడా అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటామని ఓప్పో స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,465కి చేరుకోగా.. ఇప్పటి వరకూ 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించింది. పరిశ్రమలకు 30 శాతం ఉద్యోగులతో పనిచేయడానికి అనుమతించింది. దీంతో ఓప్పో ప్లాంట్ తన కార్యకలాపాలను ప్రారంభించింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *