శృంగారానికి ముందు ఉల్లిపాయలు తినొద్దట.. ఎందుకంటే..సెక్స్ అంటే అదేదో బూతు పదం ఏం కాదు.. అన్ని పనుల్లానే అది ఓ పనే.. కొంతమంది ఇది ఏదో చెప్పకూడని పదం.. చేయకూడని పని అన్నట్లు చూస్తారు. ఇంకొంత మంది తమకు తెలిసినదే అసలైన కార్యం అనుకుంటారు. ఈ విషయంలోనూ చాలా తెలుసుకోవాల్సినవి ఉంటాయి. మనం వ్యవహరించే తీరు.. తీసుకునే ఆహారం.. చేసే సమయం అన్నీ కూడా శృంగారానిపై ప్రభావం చూపుతాయి. ఈ విషయం ప్రతీ ొక్కరూ గుర్తుపెట్టుకోవాలి.

చాలా మంది తెలిసీ తెలియక తెలిసినవే కొన్ని తప్పులు చేస్తుంటారు. దాని వల్ల శృంగార సమస్యలను ఎదుర్కొంటారు. సమస్యంటే.. దానికి కారణాలు వారికే తెలియకపోవడం. అవును మనం రోజూ తీసుకునే ఆహార ప్రభావం కూడా సెక్స్ పై ఉంటుంది. ఈ విషయంపై అనేక పరిశోధనలు చేసిన పరిశోధకులు సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారపదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు. వీటితో పాటు.. కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే ఆ పనిలో కాస్తా నీరసించి పోతారని తెలియజేస్తున్నారు. ఆ ఫుడ్ ఐటెమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

డెయిరీ ప్రొడక్ట్స్..

డెయిరీ ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, ఇవి అరగడానికి చాలా సమయం పడుతుంది. ఈ కారణంగా సెక్స్‌కి ముందు ఈ ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదని సెక్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

క్యాబేజీ..

కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే క్యాబేజీ సెక్స్ కోరికలను నశింపజేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో మీరు ఆ పనిని ఎంజాయ్ చేయలేరు. సెక్స్‌కి ముందు దీనిని తినకపోవడమే మంచిది.

బీన్స్ ..
బీన్స్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలిచ్చే బీన్స్.. సెక్స్ విషయంలో మాత్రం ప్రతికూల ఫలితాలను ఇస్తుందని తేలింది. ఎందుకుంటే ఇందులో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కారణంగా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో గనుక సెక్స్ చేస్తే ఆ ఎఫెక్ట్ జీర్ణాశయంపై పడి పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది. దీని వల్ల అసౌకర్యంగా ఉంటుంది. అలానే జరిగితే అనేక సమస్యలు ఎదురవుతాయి. శృంగార సమయంలో చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది. కాబట్టి సెక్స్‌కి ముందు ఇది తినడం సరికాదని చెబుతున్నారు నిపుణులు.

ఉల్లిపాయలు..
ఉల్లిపాయలు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. అయితే, సెక్స్ చేయడానికి ముందు మాత్రం వీటిని తినకూడదు. కారణం లేకపోలేదు. వీటిని తిన్న తర్వాత నోటి నుంచి అదో రకమైన వాసన వస్తుంది. ఇది మీ పార్టనర్‌కి నచ్చకపోవచ్చు. కాబట్టి.. సెక్స్ ‌కి ముందు తినకపోవడమే మంచిది.

కేక్స్..

కేక్ చూడగానే అందరి నోళ్లు ఉవ్విళ్లూరుతాయి. హ్యాపీగా ఓ పీస్ లాగించేస్తాం. ఇవేనా.. మఫిన్స్, పాస్ట్రీలు ఇలాంటి స్వీట్ ఐటెమ్స్ కూడా సెక్స్ విషయంలో అసౌకర్యంగా కలిగిస్తాయని తేలింది. ఇది కేవలం దంపతుల్లో ఏ ఒక్కరి విషయంలోనే కాదు.. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ శృంగార సామర్థ్యాన్ని నశింపజేస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది.

సోయా..

సోయా గింజలు కూడా సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేయనివ్వవు. వీటిని తినడం వల్ల టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కాదు. ఈ కారణంగా మగవారిలో ఆ కోరికలు, సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి సెక్స్‌కి ముందు ఈ ఆహారాన్ని తీసుకోకపోవడమే చాలా మంచిది.

ప్రాసెస్ చేసిన మాంసం..
ఈ మధ్యకాలంలో అప్పుడే తాజాగా తీసుకొచ్చిన మాంసం దొరకడం లేదు. సిటీల్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడివారు సూపర్ మార్కెట్లలో దొరికే ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకంటారు. అయితే, ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల శృంగార కోరికలు తగ్గుతాయి. ఇది టెస్టోస్టిరాన్ స్థాయిలను , లిబిడోను తగ్గిస్తుంది. కాబట్టి సెక్స్ ‌కి ముందు ఈ ఆహారాన్ని తీసుకోకపోడమే చాలా మంచిది.

ఫ్రెంచ్ ఫ్రైస్..

చూడ్డానికి నోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలామంది ఎక్కువగా ఇష్టంగా తింటారు. అయితే, ఇందులో సెక్స్ సామర్థ్యాన్ని తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి.. వీటిని సెక్స్ చేసే ముందు తీసుకోవద్దు.

ఓట్స్..

ఆరోగ్యాన్నిచ్చే ఈ ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిదే కానీ, జీర్ణమవ్వడానికి చాలా సమయం పడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్ బ్లోటింగ్ వస్తాయి. ఆ టైమ్‌లో సెక్స్‌ని అనుకున్నంతగా ఎంజాయ్ చేయలేరు.

చూయింగ్ గమ్..

టైంపాస్‌కి తినే చూయింగ్ గమ్ కూడా సెక్స్ సామర్థ్యాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి. అందుకే వీటిని ఆ పని చేసే ముందు తినకూడదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.

ఎనర్జీ డ్రింక్స్..

ఎనర్జీ డ్రింక్ష్ తాగితే ఎనర్జీ వస్తుందని చాలా మంది వీటిని ఎక్కువగా తాగుతుంటారు. అయితే, వీటిని తాగడం వల్ల అప్పటికప్పుడు ఎనర్జీ వచ్చినప్పటికీ త్వరగా నీరసం వస్తుంది. సత్తువ నశిస్తుంది. ఈ కారణంగా సెక్స్‌ని ఎంజాయ్ చేయలేరు.

పొగత్రాగడం..
పోగత్రాగడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతారు. ఇది ఆరోగ్యానికే కాదు సెక్స్ లైఫ్‌కి కూడా అంత మంచిది కాదు. సెక్స్‌కి ముందు ఎప్పుడైనా సరే పొగతాగడం వల్ల ఆ టైమ్‌‌ని మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయలేరని నిపుణులు చెబుతున్నారు.

మద్యపానం వద్దు..

మద్యపానం కూడా శృంగార కార్యక్రమాన్ని నీరుగారుస్తుందని తేలింది. సెక్స్‌కి ముందు పొగతాగడం, మద్యం సేవించడం వల్ల ఆ ప్రభావం సెక్స్ ‌పై పడుతుందని. ఆ టైమ్‌ని సరిగా ఎంజాయ్ చేయలేరని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ తీసుకుంటే మనసు, శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. కాబట్టి సెక్స్‌ని సరిగా ఎంజాయ్ చేయలేరు.

సెక్స్ విషయంలో కొన్ని కొన్ని చిన్న తప్పులే పెద్ద సమస్యగా మారతాయి. ఒక్కసారికి ఏమవుతుందిలే అంటూ మనం కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటాం కానీ, అవి నిజంగానే పడకగదిలో ప్రతికూల ప్రభావం చూపి దంపతులను నీరుగార్చేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి.. మీరు సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలను తీసుకోవాలి.

శృంగారమే దంపతులను మరింత దగ్గర చేస్తుంది. విడాకులు తీసుకునే చాలా మంది దంపతుల కామన్ ప్రాబ్లమ్ ఎంజాయ్ చేయకపోవడమే. అయితే, అది మాత్రమే ముఖ్యం అని కాదు. కానీ, దంపతులను మరింత దగ్గర చేయడంలో సెక్స్ కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి.. ఈ విషయంలో తెలిసీ తెలియకుండా ఎలాంటి తప్పులు చేయకపోవడమే మంచిది..Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *