సంపదలో ముకేశ్ అంబానీనే వెనక్కి నెట్టిన మహిళ..!దేశంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరు. పరిచయం అవసరం లేని పేరు ఆయనది. వ్యాపార సామ్రాజ్యాన్ని మెల్లమెల్లగా విస్తరించుకుంటూ వస్తున్న బిజీ జిజినెస్‌మెన్. ఆయన మరెవరో కాదు ముకేశ్ అంబానీ. భారత్‌లో అత్యంత సంపన్నుడు. ప్రపంచంలోని టాప్ సంపన్నుల్లో ఒకరు. అలాంటి ముకేశ్ అంబానీని సంపదలో మెకంజీ బెజోస్ వెనక్కి నెట్టారు.

ముకేశ్ అంబానీ కన్నా ఇప్పుడు మెకంజీ బెజోస్ అత్యంత సంపన్నురాలు. దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన ఫౌండర్ జెఫ్ బెజోస్ మాజీ భార్యనే మెకంజీ బెజోస్. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. మెకంజీ బెజోస్ సంపద విలువ ఏప్రిల్ 15న 8.2 బిలియన్ డాలర్లు పెరిగింది. అమెజాన్ షేరు ధర 5.3 శాతం పెరగడం ఇందుకు కారణం.

Also Read:

అమెజాన్‌లో మెకంజీ బెజోస్‌కు 4 శాతం వాటా ఉంది. భర్త నుంచి విడాకుల భరణం కింద ఆమెకు ఈ వాటా లభించింది. ప్రపంచంలోనే 18వ అత్యంత సంపన్నురాలిగా ఇప్పుడు ఈమె కొనసాగుతున్నారు. ముకేశ్ అంబానీ ర్యాంక్ 19వ స్థానానికి పడిపోయింది. మహిళా సంపన్నుల జాబితాలో అయితే మెకంజీ రెండో స్థానంలో ఉన్నారు.

ఇక ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు. ఈయన సంపద విలువ 138.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏప్రిల్ 15న ఈయన సంపద విలువ 24 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇక ముకేశ్ అంబానీ సంపద విలువ మార్చి 19 నాటికి 34.4 బిలియన్ డాలర్లుగా ఉంది. మెకంజీ సంపద విలువ 45.3 బిలయన్ డాలర్లు వద్ద కొనసాగుతోంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *