సచిన్ ఇంకా బాగా బ్యాటింగ్ చేసుండొచ్చు: కపిల్‌దేవ్భారత దిగ్గజ క్రికెటర్ ఇంకా బాగా క్రికెట్ ఆడిండొచ్చని మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అభిప్రాయపడ్దాడు. 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్.. 24 ఏళ్లపాటు క్రికెట్ ఆడి ఏకంగా 100 శతకాలు నమోదు చేశాడు. అయితే.. రెండు దశాబ్దాలు ఆడిన సచిన్ మరిన్ని రికార్డులు నెలకొల్పి ఉండొచ్చని చెప్పుకొచ్చిన కపిల్‌దేవ్.. అతని ఫ్యామిలీ త్యాగం మరువలేనిదని వెల్లడించాడు.

సచిన్ టెండూల్కర్ ఇటీవల 47వ పుట్టినరోజు జరుపుకోగా.. అతనికి శుభాకాంక్షలు చెప్పిన కపిల్‌దేవ్.. సచిన్ కెరీర్ గురించి సుదీర్ఘంగా మాట్లాడాడు. ‘‘భారత్ తరఫున ఆడిన క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ మెరుగైన బ్యాట్స్‌మెన్. అయితే.. అతను ఇంకా బాగా క్రికెట్ ఆడిండొచ్చని నా అంచనా. మనం చూసిన దానికంటే సచిన్ ఇంకా మెరుగ్గా ఆడగలడు. 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాడని చెప్పడం సులువే కానీ.. ఆడి చూపించడం చాలా కష్టం. సచిన్ కెరీర్‌ కోసం అతను ఫ్యామిలీ చేసిన త్యాగం మరువలేనిది’’ అని వెల్లడించాడు.

24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 53.79 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆడిన 463 వన్డేల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేసిన సచిన్.. 49 శతకాలు, ఒక ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? వన్డే క్రికెట్‌లో ఫస్ట్ డబుల్ సెంచరీ సాధించింది సచిన్ టెండూల్కరే. 2010లో దక్షిణాఫ్రికాపై నమోదు చేశాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *