సచిన్ క్రమశిక్షణకి 241* మచ్చుతునక: లారాభారత దిగ్గజ క్రికెటర్ 2004లో ఆస్ట్రేలియాపై చేసిన డబుల్ సెంచరీ.. నా దృష్టిలో చాలా క్రమశిక్షణ కలిగిన ఇన్నింగ్స్‌ అని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ టోర్నీలు రద్దవడంతో ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్న లారా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉన్నాడు. ఈ మేరకు ఓ అభిమాని ‘‘ మీ దృష్టిలో సచిన్ క్రమశిక్షణ కలిగిన బెస్ట్ ఇన్నింగ్స్ ఏది..?’’ అని ప్రశ్నించగా లారా సమాధానమిచ్చాడు.

Read More:

2004లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 436 బంతుల్లో 241 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పటి వరకూ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతులు విసురుతూ ఆస్ట్రేలియా బౌలర్లు తనని ఔట్ చేయడంతో.. ఆ ఇన్నింగ్స్‌లో సచిన్ కనీసం ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడకుండా పట్టుదలతో డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో.. భారత్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌ని 705/7తో డిక్లేర్ చేయగా.. బౌలర్లు నిరాశపరచడంతో ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Read More:

సచిన్ కెరీర్ గురించి లారా మాట్లాడుతూ ‘‘16 ఏళ్లకే టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడటాన్ని ఒక్కసారి ఊహించుకోండి. నమ్మశక్యంగా లేదు కదా..? సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో ఎన్నో బెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ.. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో అత్యంత అంకిత భావం, క్రమశిక్షణని కనబర్చాడు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు క్రమశిక్షణతో ఎలా మెలగాలో..? సచిన్ 241* ఇన్నింగ్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు’’ అని వెల్లడించాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *