సెల్‌ఫోన్ కోసం అక్కతో గొడవ.. తమ్ముడి ఆత్మహత్య.. చిత్తూరులో విషాదంచిన్నారులు సెల్‌ఫోన్‌కి బానిసలైపోతున్నారు. ఫోన్ కోసం గొడవలు.. అలకలు దాటిపోయి కొందరు అఘాయిత్యాలకూ ఒడిగడుతున్నారు. సెల్‌ఫోన్ కోసం అక్కతో గొడవపడి బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా చిత్తూరులో జిల్లాలో వెలుగుచూసింది. మండలం దోర్ణకంబాలకు చెందిన రాజు, సుమతి దంపతులకి కూతురు ముని విద్య, కొడుకు ముని తేజ సంతానం.

స్కూల్ లేకపోవడంతో ఇంట్లో ఉంటున్న అక్కా తమ్ముళ్లు సెల్‌ఫోన్ కోసం గొడవపడ్డారు. ఇద్దరూ బాగా అల్లరి చేస్తుండడంతో తండ్రి రాజు తీవ్రంగా మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన బాలుడు మునితేజ గదిలోకి వెళ్లి తలపులు వేసుకుని గడియ పెట్టుకున్నాడు. కొద్ది సేపటికి అనుమానం వచ్చి తలుపులు కొట్టినా తెరవకపోవడంతో బలవంతంగా తెరిచి చూడడంతో ఉరికి వేలాడుతూ కనిపించాడు.

Also Read:

తండ్రి తిట్టాడన్న మనస్థాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న కొడుకుని 108 వాహనంలో రుయాకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

Read Also:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *