సైక్లింగ్ చేస్తే కాన్సర్ రాదట..బ్రెస్ట్ క్యాన్సర్… రోజురోజుకీ విస్తరిస్తున్న ఈ వ్యాధి కారణంగా ఎంతోమంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. వారానికి కొంత సమయం సైక్లింగ్ చేయడం వల్ల ఈ వ్యాధి తగ్గిపోతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఎన్నో జబ్బులు దూరం అవుతాయి. ఒక్కో ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఒక్కో సమస్య దూరం అవుతుంది. తాజాగా సైక్లింగ్ గురించి మరో తాజా విషయం తెలిసింది. వారానికి కొంత సమయం సైక్లింగ్ చేయడం వల్ల క్యాన్సర్ తగ్గిపోతుందని పరిశోధకులు తెలిపారు. కొంతమంది పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో వారానికి 150 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం వల్ల 30 శాతం మందికి క్యాన్సర్ తగ్గిపోయినట్లు గుర్తించారు.

అంతేకాదు.. జబ్బు రాకముందే సైక్లింగ్ చేయడం వల్ల ఫలితం ఉంటుందని తేలింది. పదేళ్లుగా హైడెల్‌బెర్గ్‌లోని ‘జర్మనీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్’కి చెందిన పరిశోధకులు 2 వేల మందిపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని తేల్చారు. బ్రెస్ట్ క్యాన్సర్, వ్యాయామానికి సంబంధం ఏమైనా ఉందా అనే అంశంపై తొలిసారిగా అధ్యయనం జరిపిన పరిశోధకులు సరికొత్త విషయాలు తెలిపారు.

సైక్లింగ్ చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గడమే కాకుండా అనేక లాభాలు ఉన్నాయి.

బైసైకిల్..

కొన్ని సార్లు బయట సైకిల్ తొక్కడ కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఇంట్లోనే బైసైకిల్ తొక్కొచ్చు. హెల్త్ బైసైకిల్ అని పిలిచే దీనిపై కొంత సమయం వ్యాయామం చేస్తే చాలు ఎన్నో లాభాలు ఉంటాయి. బయట సైక్లింగ్ చేసేందుకు ఇబ్బందిపడేవారికి బెస్ట్ ఆప్షన్. దీన్ని ఇంట్లోని ఓ గదిలో ఎక్కడైనా పెట్టి మొల్లిగా సైక్లింగ్ ప్రారంభించాలి. ఇలా చేస్తూ చేస్తూ వేగాన్ని పెంచుకుంటూ పోవాలి. అయితే, ఈ వ్యాయామాన్ని ప్రారంభించే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాధులు, వాంతులు, జలుబు, విరేచనాలు, మూలశంక, ఇలాంటి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని ఆశ్రయించకపోవడమే మంచిది.

సైక్లింగ్‌తో లాభాలు..

 • సైక్లింగ్ అనేది కండరాలను దృఢపరుస్తుంది. దీని వల్ల ఫిట్‌గా ఉంటారు.
 • సైకిల్ తొక్కడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది.
 • సైక్లింగ్ చేస్తే క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధిస్తారు.
 • రెగ్యులర్‌గా చేయడం వల్ల అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక సమస్యలు వంటివి చాలావరకూ దూరం అవుతాయి.
 • సైకిల్ అనేది ప్రయాణ సాధానాల్లో అన్నిటికంటే చౌకగా లభిస్తుంది. దీని వల్ల అతి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ వ్యాయామం చేసే అవకాశం ఉంటుంది.
 • కంప్యూటర్ వర్క్స్ ఎక్కువ చేసేవారిలో నడుము నొప్పి, వీపు నొప్పులు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. సైక్లింగ్ చేయడం వల్ల నరాలు లాగడం, వెన్నునొప్పి, పాదాలు, మడమల, కీళ్ల నొప్పులు, మెడనొప్పులు తగ్గుతాయి. కాబట్టి రెగ్యులర్‌‌గా సైక్లింగ్ చేస్తుండాలి.
 • గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది.
 • బీపీ అదుపులో ఉంటుంది.
 • సైక్లింగ్ చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి పడదు. ఈ కారణంగా ఎలాంటి నొప్పులు రావు.
 • పొట్ట సైజ్, కొవ్వుని తగ్గించుకోవడానికి, బరువు తగ్గించుకునేవారికి ఈ వర్కౌట్ ఎంతో లాభం చేస్తుంది.
 • సైక్లింగ్ వల్ల శరీరం కింది భాగానికి వ్యాయామం లభించి కాళ్లు దృఢంగా తయారవుతాయి.
 • సైక్లింగ్ వల్ల 330 కేలరీలు ఖర్చవుతాయి.
 • రెగ్యులర్‌గా చేయడం వల్ల కాళ్లు పట్టేయడం వంటి సమస్యలు ఎదురు కావు. కూర్చోవడం, లేవడం, నడవడం, నిలబడడం వంటివి సులభం అవుతాయి.
 • ముఖ్యంగా జీర్ణశక్తి మెరుగై అజీర్ణ సమస్యలు ఎదురుకావు.
 • రెగ్యులర్‌గా చేయడం వల్ల ఉత్సాహంగా ఉంటారు.
 • స్త్రీలలో రుతుక్రమ సమస్యలు, ఆ నొప్పులను దూరం అవుతాయి.
 • సైక్లింగ్ చేయడం వల్ల కాలేయ సమస్యలు దూరం అవుతాయి.
 • వీటిని చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
 • నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు సైక్లింగ్ చేయడం వల్ల ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
 • ఆరోగ్యం, శరీరాకృతి మెరుగవుతంది. వెన్నెముక సక్రమంగా ఉంటుంది.

జాగ్రత్తలు అవసరం..

 • అయితే సైక్లింగ్ మంచిది కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సమస్యలు ఎదురవుతాయి.
 • ప్రతికూల వాతావరణంలో సైక్లింగ్ చేయొద్దు. అంటే ఎక్కువగా గాలి, వాన, ధూళి, దుమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు సైక్లింగ్ చేయొద్దు.
 • వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సైక్లింగ్ చేయడం అంత మంచిది కాదు..
 • ఎత్తు పల్లాలు, గోతులతో ఉండే రోడ్లలో సైక్లింగ్ చేయడం వల్ల నడుము నొప్పులు ఎదురవుతాయి.
 • ఇరుకైన వీధుల్లో సైక్లింగ్ చేయడం అంత మంచిది కాదు..

సూచనలు..

 • రోజుకి ఇరవై నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే చాలు.. సైక్లింగ్ చేసేవారు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వెళ్తే సరిపోతుంది.
 • సైకిల్ తొక్కడాన్ని ఒకేసారి ఆపొద్దు.. నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ ఆపేయాలి..
 • ఈ సమయంలో మరీ వర్కౌట్ చేసినప్పటిలా కాకుండా కాస్తా వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి.
 • దీన్ని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. మధ్యలో విరామం తీసుకోవడం వద్దు.
 • సైక్లింగ్ చేసే సమయంలో మ్యూజిక్, సినిమా పాటలు వింటూ చేస్తుంటే బోర్ కొట్టకుండా ఎక్కువసేపు వర్కౌట్ చేసే వీలుంటుంది.
 • సైక్లింగ్ ప్రారంభించే ముందే మన ఎత్తుకు తగ్గ సీట్‌ని అడ్జెస్ట్ చేసుకోవాలి.
 • రోజుకి కనీసం 15 నిమిషాల పాటు ఆపకుండా సైక్లింగ్ చేయాలి.
 • వీపు, నడుము నిటారుగా సైక్లింగ్ చేయాలి.

వీరు చేయొద్దు..

 • మధుమేహం ఉన్నవారు సైక్లింగ్ చేయకపోవడమే మంచిది.
 • ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యుల సలహా అనంతరమే సైక్లింగ్ చేయాలి.

పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్య సమస్యలను సైక్లింగ్ చేయడం వల్ల తగ్గించవచ్చు. మీకు బయటికి వెళ్లినప్పుడు కారు, బైక్‌లను ఉపయోగించడం కంటే సైకిల్ వాడడం వల్ల మీకు ఆరోగ్యమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసిన వారవుతారు. దీనికి పెట్రోల్ ఇలాంటి ఇంధనాలు కూడా అవసరం లేదు. మరింకేంటి..? తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం.

ఆరోగ్యాన్ని మించిన ఆనందం లేదు. ఎలాంటి ఖర్చు లేకుండా ఆరోగ్యంగా మార్చే సైక్లింగ్‌ని మీ లైఫ్‌స్టైల్ లో చేర్చుకోండి. దీని వల్ల వచ్చే అద్భుత ప్రయోజనాలను పొందండి. సైక్లింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయని గుర్తుపెట్టుకోండి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *