హాట్ ఫొటోస్‌తో రచ్చరేపుతున్న భారత క్రికెటర్ భార్యటీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ‌కి కొత్త తలనొప్పి మొదలైంది. భేదాభిప్రాయాలతో గత కొంతకాలంగా తన భార్య హసీన్ జహాన్‌కి దూరంగా ఉంటున్నాడు. దాంతో.. షమీ నుంచి నెలకి రూ.10 లక్షలు భరణం కోరి భంగపడిన హసీన్ జహాన్.. ఇప్పుడు కొత్త పద్ధతిలో అతడ్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది. గతంలో తాము తీసుకున్న పర్సనల్ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. షమీని అవకాశవాదిగా అభివర్ణించింది. కానీ.. షమీ మాత్రం ఆమె ఆరోపణలపై స్పందించలేదు.

మహ్మద్ షమీ‌తో పెళ్లికి ముందు కొంతకాలం మోడల్‌గా పనిచేసిన హసీన్ జాహన్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు చీర్‌గర్ల్‌గా కూడా పనిచేసింది. ఆ తర్వాత 2014లో షమీని పెళ్లి చేసుకుని.. మోడలింగ్‌ని వదిలేసింది. ‘మహ్మద్ షమీ కోసం అప్పట్లో నా మోడలింగ్ కెరీర్‌ని వదులుకున్నా. కానీ.. షమీ నన్ను ఒంటరిగా వదిలేశాడు. అందుకే.. మళ్లీ మోడలింగ్‌లోకి వెళ్లాలనుకుంటున్నా. సాయం కోసం పాత స్నేహితులతో మాట్లాడేందుకు తొలుత తటపటాయించా. కానీ.. నా కూతురు భవిష్యత్‌ కోసం నేను మోడలింగ్‌కి వెళ్లాలనుకుంటున్నా. ఈ విషయంలో నా స్నేహితులు సాయం చేస్తున్నారు’ అని ఇటీవల హసీన్ జాహన్‌ వెల్లడించింది.

మోడలింగ్‌లో భాగంగా ఫొటో షూట్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న హసీన్ జహాన్.. టిక్‌టిక్‌‌లోనూ యాక్టీవ్‌గా కనిపిస్తోంది. తాజాగా మహ్మద్ షమీతో తీసుకున్న పర్సనల్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన హసీన్.. ‘‘నీ వద్ద ఏమీ లేనప్పుడు నేను చాలా పవిత్రంగా కనిపించాను. కానీ.. ఇప్పుడు నీ వద్ద అన్నీ ఉన్నాయి. దాంతో.. నేను అపవిత్రమైపోయానా..? అబద్ధం వెనుక ఉన్న నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది’’ అని ఆమె అందులో రాసుకొచ్చింది.

2018 ఆరంభంలో మహ్మద్ షమీ, అతని కుటుంబ సభ్యులు తనని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని హసీన్ జాహన్‌ కోల్‌కతా పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆ సమయంలోనే షమీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌లకి పాల్పడ్డాడని, మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని మీడియా ముందు హసీన్ ఆరోపణలు గుప్పించింది. దాంతో.. ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ.. అతనికి క్లీన్‌చిట్ ఇచ్చింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *