హిందూపురంలో దారుణం.. ఆమెతో ఆ సంబంధం వద్దన్నాడని..వివాహేతర సంబంధాల మోజులో దారుణాలకు తెగబడుతున్నారు. పడక సుఖం కోసం పగప్రతీకారాలతో రగిలిపోతున్నారు. అడ్డొచ్చినవారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడడం లేదు. వివాహిత మహిళతో అక్రమ సబంధం పెట్టుకున్న వ్యక్తిని ఆమె సమీప బంధువు హెచ్చరించడంతో హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆమెతో ఇకపై ఆ సంబంధం వదులుకుని పద్ధతిగా ఉండమని చెప్పినందుకు కొట్టిచంపేసిన అమానుష ఘటన అనంతపురంలో వెలుగుచూసింది.

మండలం మీనకుంటపల్లికి చెందిన నాగరాజు అదే గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఇద్దరూ కలుస్తుండేవారు. వారిద్దరి రాసలీలల వ్యవహారం ఆమె సమీప బంధువైన కోనాపురం అంజి(40)కి తెలిసి నాగరాజుని హెచ్చరించాడు. ఆమెతో ఆ సంబంధం వదిలేయాలని.. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికాడు.

Also Read:
వివాహేతర సంబంధం వద్దని హెచ్చరించడంతో ఆగ్రహానికి గురైన నాగరాజు దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో నాగరాజు అతని కుటుంబ సభ్యులతో కలసి అంజిపై దాడి చేశాడు. నాగరాజు, అతని తండ్రి, అన్న, బాబాయ్ కలిసి అంజిని నిర్బంధించి చావబాదారు. నాగరాజు పెద్దరాయి తీసుకుని ఛాతిపై బలంగా కొట్టడంతో అంజి స్పృహ‌ కోల్పోయాడు.

గమనించిన స్థానికులు అంజిని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంజికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు.

Read Also:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *