20 paise price: మీ వద్ద 20 పైసల నాణెం ఉందా? అయితే లక్షాధికారి కావొచ్చు.. రూ.2 లక్షల వరకు పలుకుతున్న రేటు! – old coins online price of 20 paise will surprise you


ప్రధానాంశాలు:

  • ఓల్డ్ కాయిన్స్‌ను ధర చుక్కల్లో
  • ఇవి చెలామణిలో కూడా లేవు
  • అయినా కళ్లుచెదిరే రేటు

మీ వద్ద 20 పైసలు నాణెం ఉందా? లేదంటే 25 పైసలు నాణెం కలిగి ఉన్నారా? అయితే మీరు ఏకంగా రూ.2 లక్షలు పొందే అవకాశం అందుబాటులో ఉంది. అవును మీరు చదివింది నిజమే. వింతంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం. ఎలా అనుకుంటున్నారా? అయితే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

ఓఎల్ఎక్స్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ఓల్డ్ కాయిన్స్‌ను కళ్లుచెదిరే రేటుకు విక్రయిస్తున్నాయి. ఈ కాయిన్స్ ఇప్పుడు సర్క్యులేషన్‌లో కూడా లేవు. అయినా కూడా వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆన్‌లైన్ సైట్లు ఓల్డ్ కాయిన్స్‌ను భారీ ధరకు విక్రయిస్తున్నాయి.

Also Read: ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? నష్టాలు ఇవే!

samayam telugu

paisa

Also Read: ఠారెత్తిస్తున్న టమోటా.. భారీగా పెరిగిన ధర.. ఈరోజు రేటు ఎంతంటే?

ఓఎల్ఎక్స్‌లో పాత 20 పైసలు నాణేలకు రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. 1986 నుంచి 1989 వరకు 20 పైసలు నాణేల ధర ఏకంగా రూ.2 లక్షలు ఉంది. కాగా ఈ కాయిన్స్ ధర రూ.1,000 నుంచి ప్రారంభమౌతోంది. సెల్లర్లు తమకు నచ్చిన రేటుకు ఈ కాయిన్స్‌ను విక్రయిస్తున్నాయి.

అలాగే 25 పైసలు నాణెం ధర కూడా రూ.1,000 నుంచే ప్రారంభమౌతోంది. వీటి ధర కూడా రూ.వేలల్లోనే నడుస్తోంది. ఈ ఓల్డ్ కాయిన్స్ ధర కూడా రూ.లక్ష వరకు పలుకుతోంది. 1973 నుంచి 1975 వరకు, 1988 నుంచి 1990 వరకు సిరీస్‌లోని కాయిన్స్ ధర రూ.లక్ష వరకు ఉంది. మీ వద్ద కూడా ఓల్డ్ కాయిన్స్ ఉంటే ఆన్‌లైన్ విక్రయించి కళ్లుచెదిరే లాభం పొందండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *