‘2022 వరకూ సామాజిక దూరం తప్పదు’ఓ వ్యక్తి జీవితంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్‌ను పారద్రోలేందుకు ప్రపంచ వ్యాప్తంగా లాక్‌ డౌన్, సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనిస్తాయని అంతా కొండంత ఆశతో ఉన్నారు. మునుపెన్నడూ మనిషి ఎదుర్కోలేని ఇలాంటి సందర్భాలను భరించడం ప్రతి వ్యక్తికి కాస్త ఇబ్బందిగా ఉంటున్న మాట వాస్తవమే. ఇప్పటికే పదే పదే చేతులు కడుక్కోవడం, ఎల్లప్పుడూ పరిశుభ్రతగా ఉండడం, ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవడం వంటి మంచి లక్షణాలు చాలా మందికి అలవడుతున్నాయి. అయితే, కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ లాక్ డౌన్‌ను కొద్ది రోజుల పాటు కొనసాగిస్తారు. ఆ తర్వాత దాన్ని ఎత్తేస్తారు. ఇక సామాజిక దూరం విషయానికొస్తే, ఇది మరికొంత కాలం కొనసాగక తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. అదీ కూడా దాదాపు రెండేళ్లు కావడం గమనార్హం! ఈ విషయాన్ని ఓ ప్రఖ్యాత విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అంచనా వేశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *