actress sheela singh: సీరియల్స్‌ వేస్ట్ అనేవాళ్లకి అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చి ‘మొగలిరేకులు శాంతి’ – telugu tv actress sheela singh aka mogalirekulu shanthi about serials


మనసుకు హత్తుకునే పాత్రల్లో తన తర్వాతే ఎవరైనా అని నిరూపించుకుంది షీలా సింగ్. అప్పట్లో మొగలి రేకులు.. ఇప్పుడు మట్టి గాజులు తన నటనకు కొలమానాలు. మొగలిరేకులు శాంతి క్యారెక్టర్‌తో ఎంతో మంది చేత కంటతడి పెట్టిన షీలా.. తర్వాత కూడా ఎన్నో మంచి మంచి సీరియల్స్‌తో తన కెరీర్‌ని కొనసాగింది. తర్వాత కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అయితే సీరియల్స్ వేస్ట్, వాటివల్లే జనాలు పాడైపోతున్నారు అనే కామెంట్స్‌‌‌కి బదులిచ్చింది షీలా సింగ్. అదేంటో ఆమె మాటల్లోనే చూద్దాం!

శాస్త్రీయ, జానపద నృత్యాల్లో మంచి ప్రావిణ్యం ఉన్న షీలా.. మొదటిసారి ‘లాలా గూడ లంబడి పిల్ల….’ అనే పాటతో స్క్రీన్‌కి పరిచయం అయ్యింది. బాలకృష్ణ నటించిన ‘సీమ సింహం’ సినిమాలో లేడీ పోలీస్‌ ఆఫీసర్‌గా ఫైటింగ్స్‌ సీన్స్‌లో నటించింది. ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంలో చంద్రమోహన్‌ కూతురుగా.. సుమంత్‌ హీరోగా చేసిన ‘ధన–51’ చిత్రంలో హీరో ఫ్రెండ్‌గా.. ‘చంటిగాడు’ చిత్రంలో రాములమ్మ అనే కామెడీ పాత్రతో ప్రేక్షకుల్ని అలరించింది. అయితే ‘సినిమాలకంటే టీవీ సీరియల్సే ఉత్తమం’ అని తండ్రి ఇచ్చిన సలహా.. ‘మా ఇంటి మహాలక్ష్మి’, ‘బొమ్మరిల్లు’, ‘మనసు చూడతరమా’,‘శిఖరం’,‘డాక్టర్‌ చక్రవర్తి’ ఇలా చాలా సీరియల్స్ చేశారు షీలా.

నాలుగేళ్ళ కెరీర్‌ తర్వాత ‘మొగలి రేకులు’ సీరియల్‌లో శాంతి పాత్ర ఎంపికయ్యిందట షీలా. ‘శాంతి పాత్ర నాకు చాలామంది అభిమానుల్ని సంపాదించిపెట్టింది. ఆ పాత్ర కోసం 50 మంది నటుల్లోంచి, పెర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని.. మంజులా నాయుడు నన్నే ఎంపిక చేశారు. ఎన్నో భావోద్వేగాలు, నవరసాలు పండించిన శాంతిపాత్ర నా కెరీర్‌లో ఒక పెద్ద మలుపు’ అంటూ చెప్పుకొచ్చారు షీలా. ఇక కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘నిన్నే పెళ్ళాడతా’, ‘మట్టి గాజులు’, ‘అత్తారింటికి దారేది’ సీరియల్స్ చేస్తున్నానని.. ‘నిన్నే పెళ్ళాడతా’, ‘మట్టి గాజులు’ సీరియల్స్ ఎన్నో భావోద్వేగాలు పలికించడంలో నాకు మంచి గుర్తింపు తెస్తుందని చెప్పుకొచ్చారు. ‘అత్తారింటికి దారేది’లో కొంచెం నెగటివ్ షేడ్ ఉన్నప్పటికీ… అది కూడా మంచి పాత్రే అంటున్నారు షీలా.

అయితే సీరియల్స్ వేస్ట్ అంటూ నెగటివ్ కామెంట్స్ చేసేవాళ్లకి అదిరిపోయే సమాధానం ఇచ్చింది షీలా. ‘ఒంటరితనంతో బాధపడుతున్నవారికి, వృద్ధులకు సీరియల్స్‌ వల్ల చాలా ప్రయోజనం ఉంది. అంతే కాదు సీరియల్స్‌ చూస్తే ఆడవాళ్ళు చెడిపోతారంటారు కొందరు. కానీ ఆ అభిప్రాయం పూర్తిగా తప్పు. మనం ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాయి సీరియల్స్. మంచి చెడుల విచక్షణ ఎలా బేరేజు వేసుకోవాలో చూపిస్తాయి. ఎలా ఉండకూడదో తెలుపుతూ, ముందస్తు హెచ్చరికలు చేస్తాయి. ఇంట్లో టీవీ సీరియల్‌ చూస్తున్న భార్య మనసును భర్త అర్థం చేసుకుని మెలగాలి. భార్యాభర్తలు అవగాహనతో ఉంటూ సీరియల్స్‌లో మంచిని నేర్పుకోవాలి. టీవీ ఛానల్స్‌, సీరియల్స్ వల్ల ఎంతోమందికి ఉపాథి అవకాశాలు పొందుతున్నారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సమాజానికి అర్థం పట్టేవే సీరియల్స్’ అన్నారు షీలా.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *