affordable rental housing: మోదీ సర్కార్ కొత్త స్కీమ్.. తక్కువ రెంట్‌కే ఇళ్లులు! – modi govt to launch scheme for affordable rental housing for migrants and urban poor: fm nirmala sitharaman


ప్రధానాంశాలు:

  • కొత్త పథకాన్ని తీసుకురాబోతున్న కేంద్రం
  • పట్టణ పేదలు, వలస కార్మికుల కోసం
  • అందుబాటు అద్దెకే నివాస గృహలు

కేంద్ర ప్రభుత్వం అద్దెకు ఉంటున్న వారికి శుభవార్త అందించింది. పట్టణాల్లోని పేదలకు, వలస కార్మికుల కోసం అందుబాటులోనే అద్దె ఉండేలా చూసేందుకు కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పథకం వివరాలను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది. పీపీపీ మోడల్ కింద పట్టణాల్లో హౌసింగ్ ప్రాజెక్టులను నిర్మిస్తామని నిర్మలమ్మ తెలిపారు. వీటిని ఆఫర్డబుల్ రెంటల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లుగా మారుస్తామని పేర్కొన్నారు.

అలాగే నిర్మలా సీతారామన్ తాజాగా ఇంటి కొనుగోలుదారులకు శుభవార్త అందించారు. హోమ్ లోన్‌పై మధ్యతరగతి ప్రజలు మళ్లీ సబ్సిడీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. మోదీ సర్కార్ తాజాగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్‌ను (ఎంఐజీ 1, ఎంఐజీ 2) మరి కొంత కాలం పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ఈ స్కీమ్ గడువు మార్చి 31తోనే ముగిసింది.

Also Read: నిర్మలా సీతారామన్ శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.10,000 రుణం!

స్ట్రీట్ వెండర్లకు (వీధి వ్యాపారులు) ఆమె తీపికబురు తీసుకువచ్చారు. 50 లక్షల మందికి రూ.5,000 కోట్ల నిధులు అందిస్తున్నామని పేర్కొన్నారు. వీరికి ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి మూలధనంగా రూ.10,000 వరకు రుణం అందిస్తామని తెలిపారు. నెల రోజుల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

అలాగే వలస కార్మికులకు ఉచితంగానే 2 నెలలపాటు రేషన్ అందిస్తామని నిర్మలమ్మ తెలిపారు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే.. వారికి కూడా 5 కేజీల గోధుమలు అందిస్తామని పేర్కొన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామన్నారు. తాజా నిర్ణయం వల్ల 8 కోట్ల మంది వలస కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కేంద్రం రూ.3,500 కోట్లు భరిస్తుందని పేర్కొన్నారు.

Also Read: అదిరిపోయే స్కీమ్: చేతికి ఒకేసారి రూ.45 లక్షలు.. ఇంకా ప్రతి నెలా రూ.20,000 పెన్షన్!

ఇంకా కచ్చితంగా తీసుకున్న లోన్స్‌ను తిరిగి చెల్లిస్తున్న రైతులకు వడ్డీ తగ్గింపుతో అందించే రుణాలను మే 31 వరకు పొడిగిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దాదాపు 3 కోట్ల మంది సన్నకారు రైతులు రూ.4 లక్షల కోట్ల రుణాలు పొందారని పేర్కొన్నారు. వీరికి కూడా ఆర్‌బీఐ ఈఎంఐ మారటోరియం సదుపాయం వర్తిస్తుందని మరోసారి గుర్తు చేశారు. కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు దారులు రూ.25 వేల కోట్ల రుణాలు పొందారని తెలిపారు.

అలాగే పట్టణాల్లోని పేదలు, వలసదారులకు రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎస్‌డీఆర్ఎఫ్ కింద ఆహారం అందిస్తున్నామని తెలిపారు. షెల్టర్ హోమ్స్‌లో రోజుకు మూడు పూటల అన్నం పెడుతున్నామని పేర్కొన్నారు. ఇక మార్చి 15 నుంచి చూస్తే పట్టణాల్లో కొత్తగా 7,200 స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేశామని తెలిపారు.

పట్టణాల నుంచి తిరిగి సొంతూర్లకు వెళ్లిపోయే వారికి ఉపాధి కల్పిస్తున్నామని నిర్మలమ్మ తెలిపారు. 1.87 గ్రామ పంచాయితీల్లో 2.33 కోట్ల మందిని నమోదు చేసుకున్నామని, వీరికి ఎంఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి కల్పిస్తామని, దీని కోసం రూ.10,000 కోట్ల నిధులు కేటాయిస్తామని వివరించారు. వ్యవసాయ రంగంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో 63 లక్షల రుణాలు (రూ.86 వేల కోట్లు) అందించామని తెలిపారు. నాబార్డు మార్చి నెలలో రూ.29,500 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేసిందని పేర్కొన్నారు.

కార్మిక చట్టాలను సవరిస్తున్నామని, వర్కర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కనీస వేతనాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. అపాయింట్‌మెంట్ లెటర్లు, హెల్త్ చెకప్స్ వంటివి కచ్చితంగా ఉండేలా చూస్తామని తెలిపారు. ఈఎస్ఐసీ స్కీమ్ బెనిఫిట్స్‌ను మరింత మందికి చేరేలా చూస్తామన్నారు. 100 మంది కన్నా తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలకు కూడా దీన్ని వర్తింజేస్తామని తెలిపారు. అలాగే 10 లేదా అంతకన్నా తక్కువ మంది ఉద్యోగులకు కూడా స్వచ్ఛందంగా ఈ స్కీమ్‌ను అందుబాటులో ఉంచుతామని వివరించారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *