after delivery weightloss tips: డెలివరీ తర్వాత బరువు తగ్గేందుకు ఏం చేయాలంటే.. – fastest way to lose weight after pregnancy know here details


చాలా మంది ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరుగుతారు. ఆ తర్వాత డెలీవరి తర్వాత కూడా అదే బరువుతో ఉంటారు. ఈ బరువుని ఎలా తగ్గించుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటివారు అధికబరువుని ఎలా తగ్గించుకోవాలో కొన్ని ఈజీ టిప్స్ తెలుసుకోండి.. వీటి వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అవేంటంటే..

1. హ్యాపీ గా ఉండండి..

samayam telugu

అవును.. నిజమే.. ఈ టైమ్‌లో ఎంత ఆనందంగా వుంటే అంతే మంచిది. అంతేకానీ, ఉన్న పళంగా బరువు తగ్గడం గురించి ఎక్కువగా ఆలోచించి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. డెలివరీ తర్వాత డైరెక్ట్‌గా సైజ్ జీరో జీన్స్‌లోకి వెళ్ళిన సెలిబ్రిటీల గురించి ఆలోచిస్తూ అలా మీరు మారిపోవాలని చూడొద్దు. దీని వల్ల లేని సమస్యలను మీరు తెచ్చుకున్నవారవుతారు. మీరు ఫోకస్ చేయాల్సింది మీ ఆరోగ్యంగా ఉంటూ, పుట్టిన పిల్లలతో హ్యాపీగా ఉండడం. ఎందుకంటే ఈ టైమ్ మీకు మళ్ళీ రాదు. దీన్ని మీరు మళ్ళీ ఎంజాయ్ చేయలేరు. బరువు కొన్ని రోజుల తరవాతైనా తగ్గొచ్చు. కాబటి ఈ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు.

Also Read : ఇంట్లోని వైరస్‌లను దూరం చేసే ప్లాంట్స్.. ఎక్కడైనా పెంచుకోవచ్చు..

​2. వర్కవుట్..

samayam telugu

తినడానికే కూడా టైమ్ లేనంత బిజీ గా మీరుంటే వర్కౌట్ ఎలా చేస్తారు? వర్కౌట్ అంటే కనీసం కొంత సమయం దానికి కేటాయించాలి కదా. మీరు చెప్పింది నిజమే. కానీ, ప్రస్తుతం మీకు అంత టైమ్ ఉండదు. కానీ, దొరికిన టైమ్‌లో ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు మీరు బిజీగా ఉన్నా… దొరికిన పది నిమిషాలు అయినా వాడుకోండి. మరోసారి ఇంకో పది నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్ చేయండి. ఈ పది నిమిషాలే నెమ్మదిగా ఇరవై, ముప్ఫై నిమిషాలౌతాయి.

– 10 స్క్వాట్స్

– 10 స్క్వాట్ జంప్స్

– 10 లంజెస్

– 10 పుషప్స్

Also Read : వేలి చివర్లు వాపుగా మారి నొప్పి పెడుతున్నాయా.. ఇలా చేయండి..

​3. మీకోసం కాస్తా టైమ్..

samayam telugu

ప్రతి రోజూ ఒక ఇరవై నిమిషాలు మీకోసం టైమ్ కేటాయించుకోండి. ప్రజెంట్ మీరు ఉన్న పరిస్థితిలో ఎన్నో విషయాలని బాలెన్స్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు రీచార్జ్ అవ్వకపోతే కష్టం. తీరుబడిగా వాకింగ్, ప్రేయర్, మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవ్వడం, ఇంకా చెప్పాలంటే ప్రశాంతంగా స్నానం చేయడం – మీ ఇష్టం మీ ఇరవై నిమిషాలూ మీరెలా వాడుకుంటారో అలా మీకు ఇష్టమైన పనులు చేయండి. అయితే, ఇందులో వేరే పనులు చేయకండి. అంటే.. మీరు వాకింగ్ చేస్తూ ఫోన్ లో మాట్లాడొద్దు.. చాలా మంది రెండు పనులు జరుగుతాయి అనుకుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల ఒక్క పనిపై కాన్సంట్రేట్ చేయలేరు. ఒక్కపని మాత్రమే చేయండి. అలా చేస్తేనే మీకు ఒత్తిడి తగ్గి ఎనర్జిటిక్‌గా ఉంటారు.

​​4. డైటింగ్ వద్దు..

samayam telugu

డెలీవరి తర్వాత మీరు, మీ పిల్ల కోసం హ్యాపీగా తినాలి. మీకు మాగ్జిమమ్ న్యూట్రిషన్స్ కావాలి. ఇప్పుడు హఠాత్తుగా ఫుడ్ తగ్గించడం మంచిది కాదు. దీని వల్ల బరువు పెరుగుతారు కూడా. ఒక్కోసారి మెటబాలిజం కూడా దెబ్బ తింటుంది. మీరు కేలరీలు లెక్కపెట్టుకుంటూ తినకండి. కానీ, మీరు బేబీకి ఫీడ్ చేస్తూ హ్యాపీగా బరువు తగ్గాలంటే మీరు రోజుకి 1800 కేలరీలు తీసుకోవాలి. మీ ఫుడ్ హెల్దీ గా బాలెన్స్డ్ గా ఉండేటట్లు చూసుకోవాలి. కాల్షియం, జింక్, మెగ్నీషియం, విటమిన్ బీ6, ఫోలేట్ మీరు తీసుకునే ఫుడ్ లో తప్పనిసరిగా ఉండాలి. మీరు తీసుకునే ఫుడ్ వల్ల మీకు ఆకలి తీరాలి. రుచిగా ఉండాలి, శక్తినివ్వాలి. మీరు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే కేలరీలు కౌంట్ చేయాల్సిన అవసరమే రాదు.

​5. వారానికి ఎంత తగ్గాలంటే..

samayam telugu

మీరు చేయగలిగిన పనులని నోట్ పెట్టుకోండి. ఇలా సెట్ చేసుకునేటప్పుడు బానే ఉంటాయి. కానీ, అవి చేరుకోలేకపోతే ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నామో అలా అయిపోవాలని అనుకోడంలో తప్పేమీ లేదు. కానీ కాస్తా సహనం అవసరం. ఆ పని జరుగుతుంది, కానీ టైమ్ పడుతుందని గుర్తు పెట్టుకోండి. ఎంత టైమ్ అంటే, వారానికో అరకేజీ తగ్గితే మంచిది. అంత కంటే తగ్గితే పిల్లలకి పాలు సరిపోవు. సుమారుగా ఎవరైనా ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఒక 15 కేజీలు పెరుగుతారు అనుకుంటే, డెలివరీ అయిన మొదటి నెలలోనే తొమ్మిది పది కేజీలు తగ్గుతారు. ఆ మిగతా ఐదు కేజీలూ తగ్గడానికి కాస్తా సమయం పడుతుంది.

Also Read : ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే ఇలా చేయండి..Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *