anchor suma: Pushpa : యాంకర్ సుమా మరో ప్రయోగం! అల్లు అర్జున్ సిస్టర్ క్యారెక్టర్ గురించి క్లారిటీ.. – anchor suma kanakala not a part of allu arjun pushpa movie


సుమా అంటే ఎంటర్‌టైన్మెంట్.. ఎంటర్‌టైన్మెంట్ అంటే సుమా. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఆ క్రేజ్‌తో.. తన పేరు మీదే ‘సుమక్క’ యూట్యూబ్ ఛానల్ పెట్టి.. రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ.. లాక్ డౌన్‌లో కూడా.. యాంకర్ సుమ అభిమానులకి వినోదాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సరికొత్త ఐడియాలతో వీడియోలు చేస్తూ.. ‘వాట్ కెన్ ఐడియా సుమాజీ’ అనిపించుకుంటోంది. మొన్నటికి మొన్న.. ‘లేటెస్ట్ మీమ్స్‌పై రివ్యూ’ అంటూ.. కొన్ని ఫన్నీ మీమ్స్ చదివి వీడియో చేసి కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు తన అభిమానులతో ముచ్చటించిన వీడియో ఒకటి వదిలి మరో ప్రయోగం చేసింది.

సుమ్మక్క యూట్యూబ్ ఛానల్‌కి సబ్‌స్ట్రైబ్ చేసిన అభిమానులు కొందర్ని సెలెక్ట్ చేసుకుని, వారితో వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుంది. ‘అబ్బా.. చాలా రోజుల తర్వాత మనుషులతో మాట్లాడబోతున్నాను.. చాలా హ్యాపీగా ఉంది’ అంటూ అందరితో మాట్లాడుతూనే.. ‘ఈ లాక్ డౌన్‌లో ఏం మిస్ అయ్యారు? ఏం నేర్చుకున్నారు? మీరు లాక్ డౌన్‌లో ఎలా ఉన్నారు?’ అంటూ రకరకాల ప్రశ్నలు వేసి కామెడీ చేస్తేనే.. చూసే ఆడియన్స్‌కి ఫుల్ జోష్ క్రియేట్ చేసింది సుమక్క.

మధ్య మధ్యలో సుమా ఆంటీ అని పిలిచేవాళ్లు కొందరైతే.. ‘మీ వయసు నా వయసు సేమ్’ అంటూ కొందరు చెప్పడం.. భలే ఫన్నీగా సాగింది. అయితే మొత్తానికి.. అందులో ఓ అభిమాని.. ‘అక్కా.. మీరు అల్లు అర్జున్ సిస్టర్ క్యారెక్టర్ చెయ్యబోతున్నారట నిజమేనా?’ అని అడగడంతో.. ‘లేదు, అలాంటివి నమ్మొద్దు. అది ఫేక్ న్యూస్.. నేననే కదా.. ఏ సెలబ్రెటీ అయినా సరే.. డైరెక్ట్‌గా వచ్చి వీడియోలో చెబితే కానీ ఇలాంటి న్యూస్‌లు నమ్మకండి..’ అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సరదాగా సాగిన ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వెయ్యండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *