andhra corona cases: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, పడిపోయిన మరణాలు – ap coronavirus cases reported for 5,785 and death toll decreased for 33 on 6th october tuesday


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగిపోయాయి. సోమవారం భారీగా పడిపోయిన కేసులు మంగళవారం మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. అయితే కరోనా మరణాలు మాత్రం తగ్గిపోయాయి. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 65,889 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 5,795 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 7,29,307కు చేరుకున్నాయి.

అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా స్వల్పంగా పడిపోయాయి. మంగళవారం కరోనా బారినపడి 33 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,052కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మృత్యువాత పడ్డారు.

అలాగే గత డిశ్చార్జిలు కూడా రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిపోయాయి. మంగళవారం 6,046 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 7,29,307 పాజిటివ్ కేసులకు గాను, 6,72,479 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 50,776 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లా, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు యథావిధిగా పెరిగిపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే కరోనా కేసులు లక్ష దాటగా, చిత్తూరు జిల్లాలో సైతం గత కొన్ని రోజుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి.

మంగళవారం కరోనా వైరస్ కేసుల వివరాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *