ap coronavirus cases: ఏపీలో కొత్తగా 71 కరోనా పాజిటివ్.. గత 24 గంటల్లో ఆ ఒక్క జిల్లాలో 43 కేసులు – 71 fresh coronavirus cases in andhra pradesh, total rise to 1403


ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 71 పాజిటివ్ కేసులు నమోదైనట్లు గురువారం బులిటెన్‌లో ఆరోగ్య ఆంధ్ర ప్రకటించింది. కర్నూలు జిల్లాలో 43, కృష్ణా జిల్లాలో 10.. గుంటూరు, కడప జిల్లాల్లో 4 చొప్పున.. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 3 చొప్పున.. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో రెండు కేసులు చొప్పున నమోదయ్యాయి. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 1403 కాగా.. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా యాక్టివ్ కేసులు 1051గా ఉన్నాయి.

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 386 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లా 287 కేసులు ఉన్నాయి.. ఇక కృష్ణా జిల్లా కూడా 2406 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 321మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 31మంది చనిపోయారు. అయితే ఇవాల్టి లెక్కల్లో కర్నూలు జిల్లాలోనే 43 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో ఎలాంటి మరణం సంభవించలేదు.

జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా -386
గుంటూరు జిల్లా – 287
కృష్ణా జిల్లా – 246
నెల్లూరు జిల్లా -84
చిత్తూరు జిల్లా – 80
కడప జిల్లా -73
ప్రకాశం జిల్లా – 60
పశ్చిమ గోదావరి జిల్లా – 56
అనంతపురం జిల్లా -61
తూర్పుగోదావరి జిల్లా – 42
విశాఖపట్నం జిల్లా -23
శ్రీకాకుళం జిల్లా – 5
మొత్తం కేసులు -1403
(గమనిక: ఈ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 321మందికి ట్రీట్మెంట్ తర్వాత నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *