ap coronavirus cases: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 2500పైగా పాజిటివ్, మరణాలు 55 – 62 coronavirus positive cases filed in andhra pradesh, death reach to 55


ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. గురువారం కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. శుక్రవారం మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62 కేసులు నమోదైనట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జిల్లాలవారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2514కు చేరగా.. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా యాక్టివ్ కేసులు 728గా ఉన్నాయి.

Read Also:జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు షాక్.. ఆ జీవో రద్దు, ఈ నెల 28లోగా!

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 600పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1731మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 55మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఒకరు ప్రాణాలు విడిచారు. తాజాగా చిత్తూరు, నెల్లలూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: కరణం Vs ఆమంచి.. చీరాలలో ఆసక్తికర రాజకీయం

రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో చిత్తూరు జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 14 మంది కోయంబేడు (తమిళనాడు) నుంచి మొత్తం 18మంది వచ్చారని తెలిపింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 153 ఉన్నాయని ప్రకటించారు. జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలను బులిటెన్‌లో తెలియజేయలేదు. ఈ 153తో 2514 కలిపితే 2667కు చేరినట్లు లెక్క.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *