ap coronavirus cases: ఏపీ కరోనా అలర్ట్: మళ్లీ పెరుగుతున్న కేసులు.. మొత్తం 2205, మరణాలు 49 – 48 new coronavirus positive cases in andhra pradesh, total reach to 2205


ఏపీలో కరోనా పంజా విసురుతోంది. గత రెండు, మూడు రోజులుగా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినా.. మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా మరో 48 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 9 కేసులు చొప్పున..చిత్తూరు జిల్లాలో 8, కృష్ణా జిల్లాలో 7, విశాఖపట్నం 4.. పశ్చిమగోదావరి, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2205కు చేరగా.. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా యాక్టివ్ కేసులు 803గా ఉన్నాయి.

Read Also: ఏపీ ప్రజలకు అలర్ట్.. కరెంట్ బిల్లులపై అనుమానం ఉంటే ఇలా చేయండి:‌

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 413 కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1353మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 49మంది చనిపోయారు. అయితే ఇవాల్టి లెక్కల్లో కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది చొప్పును కేసులు నమోదయ్యాయి.

Also Read: ఏపీకి తుఫాన్ ముప్పు.. దూసుకొస్తున్న ఎంఫాన్

ఇదిలా ఉంటే ఆరోగ్యశాఖ మరో కీలకమైన విషయాన్ని వెల్లడించింది. ఇతర రాష్ట్రాల వారికి సంబంధించిన కేసుల్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆ కేసులు 150 ఉన్నాయని తెలిపింది. ఇతర రాష్ట్రాలకు చెందినవారి కేసుల్ని ప్రత్యేకంగా నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలు జిల్లా 608
గుంటూరు జిల్లా – 413
కృష్ణా జిల్లా – 367
చిత్తూరు జిల్లా – 173
నెల్లూరు జిల్లా -149
అనంతపురం జిల్లా -122
కడప జిల్లా -102
విశాఖపట్నం జిల్లా -72
పశ్చిమ గోదావరి జిల్లా – 70
ప్రకాశం జిల్లా – 63
తూర్పుగోదావరి జిల్లా – 52
శ్రీకాకుళం జిల్లా – 7
విజయనగరం జిల్లా -7
మొత్తం కేసులు -2157
(గమనిక: ఈ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 1353మందికి ట్రీట్మెంట్ తర్వాత నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *