AP MedTech Zone: భారతావనికి ఇదో ఆశాకిరణం.. క్రెడిట్ ఎవరిది?



కరోనా వైరస్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రావడంతో… మెడ్‌టెక్ జోన్‌ పేరు తెలుగు రాష్ట్రాలోనే కాకుండా దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. మెడ్‌టెక్ జోన్ క్రెడిట్‌ను ఖాతాలో వేసుకోవడానికి టీడీపీ, వైఎస్సార్సీపీ పోటీ పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ బాబు సీఎంగా ఉన్న సమయంలో ఏర్పాటైంది కాబట్టి కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ఘనత కూడా తమదేనని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. మెడ్‌టైక్ జోన్‌లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ ఆరోపించిన విషయాన్ని కూడా తెలుగు తమ్ముళ్లు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు మాత్రం.. తమ ప్రభుత్వ సహకారంతో ఏపీ మెడ్‌టెక్ జోన్‌లోని మోల్బియో డయాగ్నోస్టిక్స్ ఈ కిట్లను రూపొందించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. ‘భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు సహకారంతో వెంటిలేటర్లు, డయాగ్నోస్టిక్ కిట్ల ఉత్పత్తికి సంబంధించిన టెక్నాలజీని కూడా ఇక్కడికి తీసుకొచ్చాం. థర్మల్ స్కానర్ల ఉత్పత్తి ప్రారంభమైంది. భారత ప్రభుత్వం ఇప్పటికే 3500 వెంటిలేటర్ల కోసం ఆర్డర్ ఇచ్చింద’ని సజ్జల తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *