ap weather report: ఏపీలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి.. ఈ 4 జిల్లాల ప్రజలకు హెచ్చరికలు – three men died in vizianagaram due to lightning thunderbolt


విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలో పిడుగు పడి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీ మరువాడ గ్రామానికి చెందిన అన్నదమ్ములు పారయ్య (62), పండయ్య (53) చిన్నతోలు మండగూడ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు భూషణ్‌రావు (35) సోమవారం సాయంత్రం పొలం పనులు నిమిత్తం వెళ్లారు. ఈ లోపు వర్షం పడడడంతో సమీపంలో ఉన్న పాకలోకి తలదాచుకున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగులు పడడంతో ముగ్గురూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

వీరితో పాటు ఉన్న పండయ్య భార్య, పాప స్పృహ తప్పి పడిపోగా కొద్దిసేపటికి మెలుకువ రావడంతో ముగ్గురినీ పాక లోపలి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ విషయం సమీపంలో ఉన్న గ్రామస్థులకు తెలియజేశారు. వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని, ఆ ముగ్గురూ అప్పటికే మరణించినట్టు గుర్తించారు. చిన్న మేరంగి ఇన్‌చార్జి ఎస్సై శివప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ జిల్లాల్లో పిడుగులు పడే చాన్స్..
విజయనగరంలో పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం చెందిన నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు, గొర్రెల కాపరులకు హెచ్చరికలు జారీచేశారు. ఈ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నెల్లూరు జిల్లా:

వరికుంటపాడు, చంద్రశేఖరపాలెం

గుంటూరు జిల్లా:

అమరావతి, పెదకురుపాడు, తాడికొండ, అచంపేట్, క్రోసూరు, చందర్లపాడు.

ప్రకాశం జిల్లా:

హనుమంతునిపాడు, తర్లుపాడు

కడప జిల్లా:

పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె, కలసపాడు, వేంపల్లె, యర్రగుంట్ల, కమలాపురం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *