asia cup 2020: ఐపీఎల్ కోసం ఆసియా కప్ షెడ్యూల్‌ని మార్చబోం: పాక్ బోర్డు – india vs pakistan: will not move asia cup 2020 for ipl 2020 says pcb


భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరిగే ఐపీఎల్ కోసం ఆసియా కప్ షెడ్యూల్‌ని మార్చబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని ఇటీవల బీసీసీఐ నిరవధికంగా వాయిదావేసింది.

సెప్టెంబరులో ఆసియా కప్‌కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుండగా.. అక్కడికి భారత్‌ జట్టుని పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఆ టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహించాలని పీసీబీ నిర్ణయించింది. అయితే.. ఇప్పుడు ఆసియా కప్‌ని పాక్ వాయిదా వేస్తే..? సెప్టెంబరులో ఐపీఎల్‌ని నిర్వహించుకోవచ్చని బీసీసీఐ భావిస్తోంది. కానీ.. ఐపీఎల్ కోసం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసియా కప్‌ షెడ్యూల్‌ని మార్చబోమని పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ స్పష్టం చేశాడు.

Read More: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కష్టాలు.. ఆటగాళ్లకి మ్యాచ్ ఫీజుల్లేవ్

‘‘ఆసియా కప్‌ని సెప్టెంబరులో నిర్వహించాలని మేము కృతనిశ్చయంతో ఉన్నాం. ఒకవేళ కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని వాయిదా వేస్తాము తప్ప.. ఐపీఎల్ కోసం మాత్రం షెడ్యూల్‌ని మార్చబోం. ఇటీవల నేను కూడా కొన్ని వార్తలు విన్నాను. ఆసియా కప్‌ని మేము నవంబరు – డిసెంబరుకి మార్చబోతున్నట్లు అందులో చెప్పుకొచ్చారు. కానీ.. అది సాధ్యం కాదు’’ అని వసీమ్ ఖాన్ వెల్లడించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *