Attempt to Murder Visakha Dairy Director: విశాఖ డెయిరీ డైరెక్టర్‌పై హత్యాయత్నం.. ముగ్గురిపై కత్తులతో దాడి.. – attempt to murder on visakha dairy director satyanarayana


విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమళ్ళపూడిలో దారుణం చోటుచేసుకుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణతో పాటు మరో ఇద్దరిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో విశాఖ డెయిరీ డైరెక్టర్ సహా మిగిలిన ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వీరికి చికిత్స కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. మరోవైపు భూ తగాదాలే ఈ దాడికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఓసారి సత్యనారాయణపై కొందరు దాడికి పాల్పడ్డారు. అప్పట్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *