Baking soda uses: బేకింగ్ సోడాతో కిడ్నీ సమస్యలు దూరం అవుతాయా.. – benefits and uses of baking soda know here details


బేకింగ్ సోడా లేని సరుకుల లిస్టు ఉండదు. వంట గదిలో అది ఉండి తీరాల్సిందే. మైసూర్ బజ్జీల మీదకి మనసు పోతే బేకింగ్ సోడా లేకపోతే పని జరగదు. అలాగని వంట సోడా వంటకే కాదు… ఇంకా చాలా వాటికి పనికొస్తుంది.

1. జీర్ణ సమస్యలు దూరం..

ఎక్కువ తిన్నా, సరిగ్గా అరక్కపోయినా, గుండెల్లో మంటగా అనిపిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. ఆ మంట పొట్టలో నించి గొంతు వరకూ తెలుస్తుంది. ఒక గ్లాసు చల్లని నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి ఆ మిశ్రమాన్ని నెమ్మదిగా తాగితే గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. మౌత్ వాష్ గా..

మనం తింటున్న స్పైసీ ఫుడ్స్ కీ, తాగుతున్న కాఫీ టీలకీ కేవలం రెండు పూటలా పళ్ళు తోముకుంటే సరిపోదు. మౌత్ వాష్ కూడా అవసరం అవుతోంది. పైగా ఈ మౌత్ వాష్ బ్రష్ చేరుకోలేని ప్రదేశాలని కూడా శుభ్రం చేస్తుంది. అయితే, ఇందు కోసం ప్రత్యేకంగా మౌత్ వాష్ కొనుక్కోక్కర్లేదు. అర గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర చెంచా బేకింగ్ సోడా వేసి మౌత్ వాష్ లా వాడొచ్చు. ఇది నోటి పుళ్ళని తగ్గించడమే కాకుండా పళ్ళు తెల్లగా మెరిసేటట్లు చేస్తుంది.

Also Read : ఎన్ని చేసినా బరువు తగ్గట్లేదా.. ఇవే కారణాలు కావొచ్చు..

3. దురదలని తగ్గిస్తుంది

దురదలు, సన్ టాన్ నీ తగ్గించడంలో బేకింగ్ సోడా బాగా పనికొస్తుంది. బేకింగ్ సోడా లో కొంచెం నీరు కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్ ని అవసరమున్న చోట రాసి కొంచెంసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చెయ్యండి. ఇంకా ఇది గట్టి పడిన చర్మాన్ని మెత్తగా చేస్తుంది.

4. కిడ్నీ సమస్యలు దూరం..

క్రానిక్ కిడ్నీ డిసీజెస్ నెమ్మదిగా కిడ్నీ ఫెయిల్యూర్ కి దారి తీస్తాయి. అయితే బేకింగ్ సోడా సప్లిమెంట్లు తీసుకునే వారు ముప్ఫై ఆరు శాతం తక్కువ స్పీడ్ తో కిడ్నీ ఫెయిల్యూర్ దశ కి చేరుకుంటారని ఒక స్టడీ చెప్తోంది. కాబట్టి.. దీనిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. అంటే ఎక్కువగా తీసుకోవద్దు సుమీ..

Also Read : పాలు తాగితే జీర్ణ సమస్యలు వస్తున్నాయా.. ఇదే కారణం కావొచ్చు..

5. కాయగూరలు కడగడానికి..

కూరగాయల మీదా పండ్ల మీద పురుగు మందులు ఉంటాయేమోనని మనందరికీ భయమే. ఒకటికి పదిసార్లు కడుగుతాం. తొక్క తీసేసి తినేవైతే పరవాలేదు. దొండకాయలూ, ద్రాక్షపండ్ల లాంటి వాటి సంగతేమిటి? ఇక్కడే బేకింగ్ సోడా ఆదుకుంటుంది. బేకింగ్ సోడా కలిపిన నీటిలో పదిహేను నిమిషాల పాటూ కూరగాయలూ, పళ్ళూ ఉంచితే మాగ్జిమం అన్ని రకాల పురుగు మందులూ పోతాయి.

6. ఎయిర్ ఫ్రెషనర్

చాలా వరకూ బైట దొరికే ఎయిర్ ఫ్రెషనర్స్ చెడు వాసనని పోగొట్టలేవు. కేవలం మంచి పరిమళాన్ని అందిస్తాయి అంతే. పైగా ఇందులో ఏ కెమికల్స్ ఉంటాయో మనకి పూర్తిగా తెలియదు. అవి పడకపోతే మళ్ళీ అదో ఇబ్బంది. అంత కంటే, బేకింగ్ సోడా తో ఎయిర్ ఫ్రెషనర్ మనమే తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న సీసాలో పావు కప్పు బేకింగ్ సోడా వేసి, అందులో మీకు ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ పది పదిహేను చుక్కలు కలపండి. ఆ సీసా మూతిని పేపర్ తో కానీ, పల్చటి బట్ట తో కానీ కవర్ చేసి ఒక రిబ్బన్ తో కట్టెయ్యండి. మీకు చక్కటి పరిమళం వస్తుంది. స్మెల్ పోతోంది అనిపించగానే సీసా ని ఒకసారి కదిపితే సరి.

7. బట్టల్ని తెల్లగా చేస్తుంది

బేకింగ్ సోడా మరకల్ని పోగొట్టడమే కాదు, బట్టల్ని తెల్లగా కూడా చేస్తుంది. మీరు మామూలుగా వాడే డిటర్జెంట్ తో పాటూ అందులో సగం బేకింగ్ సోడా కూడా కలపండి. బట్టలు శుభ్రం గా తెల్లగా వస్తాయి. వాషింగ్ మెషీన్ లో అన్ని రంగుల బట్టలూ ఒకేసారి వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి.

8. క్లీనింగ్ కి దీన్ని మించింది లేదు

కిచెన్ లో ఓవెన్, కప్స్, కిచెన్ టైల్స్, వెండి వస్తువులు, మరకలు, జిడ్డు… ఇలా అన్ని బేకింగ్ సోడా తో క్లీన్ చేసేయొచ్చు. కార్పెట్ మీద మరకలు ఉంటే వాటి మీద పల్చగా బేకింగ్ సోడా చల్లండి. దీని మీద నీరూ, వెనిగర్ సమపాళ్ళలో తీసుకుని స్ప్రే చేయండి. ఒక గంట తరువాత దులిపితే మరకపోతుంది. బాత్ రూం లో షవర్స్, టైల్స్, టబ్స్, సింక్స్ అన్నీ బేకింగ్ సోడా తో క్లీన్ చెయ్యచ్చు. బేకింగ్ సోడా ని నీళ్ళలో కలిపి బట్టతో ఎక్కడెక్కడ మరకలున్నాయో అక్కడ అప్లై చెయ్యండి. ఇరవై నిమిషాల తరవాత తడి బట్టతో తుడిచేస్తే మరకలు పోతాయి.

9. ఫ్రిజ్ లోని చెడు వాసన దూరం..
ఒక్కోసారి ఫ్రిజ్ తీయగానే చెడు వాసన వస్తుంది. ఇది కొన్ని పదార్ధాలు చాలా కాలం ఫ్రిజ్ లోనే ఉంచడం వల్ల వచ్చే వాసన. అయితే ఆ పదార్ధాలు తీసేసి ఫ్రిజ్ క్లీన్ చేసినా వాసన మాత్రం పోదు. అలాంటప్పుడు ఒక కప్ లో కొంచెం బేకింగ్ సోడా వేసి ఫ్రిజ్ లో పెడితే ఈ వాసనలన్నీ పోతాయి.

Also Read : పొగాకు తింటే గుండె సమస్యలు వస్తాయా..

10. గిన్నెలు క్లీన్ చేయొచ్చు.

ఎప్పుడో అప్పుడు గిన్నో, బూరెల మూకుడో మాడకుండా వంట చెయ్యడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయితే, ఇలా జరిగినప్పుడు చేతులు నొప్పులెక్కేలా వాటిని తోమాల్సిన పని లేదు. మాడిన పాత్రలో బేకింగ్ సోడా వేసి నీళ్ళు పోసి మరగనివ్వండి. తరువాత ఆ నీళ్ళు వంపేయండి. ఇంకా ఏమైనా మరక మిగిలుంటే మామూలుగా స్క్రబ్ చేస్తే పోతుంది.

11. షూస్ వాసన రాకుండా చేస్తుంది

ఎంత జాగ్రత్తగా గాలి తగిలేలా పెట్టినా ఒక్కోసారి షూస్ కంపు కొడుతూ ఉంటాయి. ఈ సమస్యకి బేకింగ్ సోడా తో చెక్ పెట్టచ్చు. రెండు పల్చటి బట్టలు తీసుకోండి. చెరో దాన్లో చెరో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి రబ్బర్ బాండ్ తో మూటలా కట్టండి. చెరో షూలో చెరో మూటా ఉంచండి. మీరు షూ వేస్కునేటప్పుడు ఇవి బైటికి తీసి వేసేసుకోవచ్చు.

బేకింగ్ సోడా తో ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే, ఈ సారి సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒక పాకెట్ తెచ్చుకోండి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, పెద్ద ఖరీదు కూడా కాదు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *